దక్షిణాఫ్రికా యువ ఆటగాడు జూనియర్ డివిలియర్స్ గా పిలవబడుతున్న డెవాల్డ్ బ్రేవిస్.. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ యువ సంచలనం తొలిసారి జట్టుకు ఎంపికవ్వడంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎమోషనల్ అయ్యాడు.
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు జూనియర్ డివిలియర్స్ గా పిలవబడుతున్న డెవాల్డ్ బ్రేవిస్.. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అచ్చం ఏబీడీ లాగే ఆడే బ్రేవిస్ ను అక్కడి అభిమానులు ‘బేబి ఏబీడీ’ గా పిలుచుకుంటున్నారు. ఈ యువ ఆటగాడు ఏబీడీ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆ దేశ అభిమానులు భావిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అతడి ఆట కూడా అచ్చం డివిలియర్స్ మాదిరే ఉంటోంది. ప్రపంచంలో ఎన్నో లీగ్స్ లో తన సత్తా చాటుతున్న బ్రేవిస్..అనుకున్నట్లుగా దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. ఫ్యూచర్ స్టార్ గా కితాబులందుకుంటున్న ఈ యువ సంచలనం తొలిసారి జట్టుకు ఎంపికవ్వడంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ వీరిద్దరికీ ఏంటి సంబంధం అనేది ఇప్పుడు చూద్దాం.
అతడేమో సౌత్ ఆఫ్రికా. తిలక్ వర్మ దేమో తెలంగాణ. మరి వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి అని ఆరాధిస్తే ఐపీఎల్. ఈ మెగా లీగ్ పుణ్యమా అని విదేశీ ప్లేయర్లు కూడా టీమిండియా ప్లేయర్లకు మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు. తిలక్ వర్మ, బ్రేవిస్ ఇద్దరూ కూడా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నారు. కేవలం 20 సంవత్సరాల వయసు కలిగిన ఈ యంగ్ ప్లేయర్లు అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించారు. ఇటీవలే విండీస్ తో టీ 20 సిరీస్ లో డెబ్యూ చేసిన తిలక్.. తొలి సిరీస్ లో అదరగొట్టగా.. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా బ్రేవిస్ కూడా చోటు సంపాదించాడు. దీంతో తిలక్ వర్మ తన స్నేహితుడిని అభినందిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
‘తొలి సారి అంతర్జాతీయ పిలుపు అందుకున్న నీకు కంగ్రాట్స్ బ్రదర్. ఈ విషయం వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిన్ను చూస్తుంటే గర్వంగా కూడా ఉంది” అని తిలక్ పోస్టు పెట్టాడు. అంతేకాదు ఈసందర్భంగా బ్రెవిస్‌కు వీడియో కాల్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తిలక్ నెట్టింట పంచుకున్నాడు. మరోవైపు తిలక్ వర్మ తొలి సిరీస్ లోనే అదరగొట్టి ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ప్రస్తుతం నెంబర్ 4 లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఆ స్థానానికి తెలుగు కుర్రాడే కరెక్ట్ అనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి. మరి 20 ఏళ్ల వయసులో తిలక్ వర్మ, బ్రేవిస్ అంతర్జాతీయ పిలుపు అందుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.