దేశీయ మార్కెట్‌లోని బడా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోన్న నథింగ్ ఫోన్ 1 జులై 12న మార్కెట్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. మార్కెట్‌లో రిలీజ్‌కు ముందు నుంచి కూడా ఈ ఫోన్‌కు సంబంధించి పలు అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. మొబైల్ ప్రియులు ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్న ఈ ఫోన్ మార్కెట్‌లోకి విడుదలైన కొన్ని గంటల్లోనే విపరీమైన విమర్శలు ఎదుర్కొంది. ప్రసుత్తం నెట్టింట #BoycottNothing హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక నెటిజనులు.. ఓ రేంజ్‌లో ఈ మొబైల్ కంపెనీ యాజమాన్యపై విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ మొబైల్ ఫీచర్లతో సంబంధం లేకుండా డియర్ నథింగ్ పేరుతో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా టెక్ కమ్యూనిటీ నుంచి భారీ సంఖ్యలో సథింగ్ కంపెనీ ఫౌండర్ కార్ల్ పీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత భారీ ఎత్తున విమర్శలు రావడానికి కారణం ఏంటంటే..
ప్రస్తుతం ప్రీ బుకింగ్‌పై అందుబాటులో ఉన్న ఈ నథింగ్ ఫోన్.. సౌత్ ప్రజలను దారుణంగా అవమానించింది. ఈ ఫోన్ దక్షిణ భారతీయులకు కాదని చెబుతూ దారుణంగా అవమానించింది. ఈ విషయాన్ని ప్రముఖ యూట్యూబ్ చానెల్ Prasadtechintelugu లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. నథింగ్ ఫోన్ 1 దక్షిణ భారతీయులకు కాదు.. అని చెబుతూ.. కంపెనీ ఫోన్ బాక్స్ ఒపెన్ చేస్తాడు. అది ఖాళీగా ఉంటుంది. లోపల ఫోన్ ఉండదు. దాని బదులు ఓ లెటర్ కూడా ఉంటుంది. దానిలో దిస్ డివైజ్ ఈజ్ నాట్ ఫర్ సౌతిండియన్స్ అని రాసి ఉంది. దానిలో కంపెనీ వివరాలు కూడా లేవు.
ఇది కూడా చదవండి: Nothing Phone (1): సౌత్ ప్రజలను అవమానించిన Nothing Phone! ఇంత దారుణమా?
ఇక నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజనులు.. ఇండియాలో ఈ ఫోన్‌ని రిలీజ్ చేసి.. దక్షిణ భారతీయులకు కాదని చెప్పడం వెనక కంపెనీ ఉద్దేశం ఏంటి.. అని ప్రశ్నిస్తున్నారు. సౌత్ ఇండియా కూడా ఈ దేశంలో భాగమేనని.. సదరు కంపెనీ ఈ విషయం తెలుసుకుని..క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nothing Phone (1): నథింగ్ ఫోన్ 1 పై రూ. 3,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?
#DearNothing we are also indians @nothing y don’t u encourage regional YouTube creators pic.twitter.com/jjTJSGcaZH
— saleem_7 (@Saleem13296552) July 12, 2022
#DearNothing
Even we are part of India!@iamprasadtech @nothing pic.twitter.com/wSvLV495Uz— Satish_sekhar (@Happysatish1) July 12, 2022
Nothing phone 1 is not for South India #dearnothing@nothing pic.twitter.com/Vs4hN3P4GF
— vp Bharath (@vp_bharath) July 12, 2022
#DearNothing Nothing is just North pan masala phone…🥴 pic.twitter.com/oEBrvYxf2J
— Mehabub (@Mehabub94557493) July 13, 2022