వన్‌ప్లస్ మాజీ వ్యవస్థాపకుడు 'కార్ల్ పీ' సొంతంగా స్థాపించిన 'నథింగ్' కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ 'నథింగ్ ఫోన్ 1' మొబైల్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ట్రాన్సపరెంట్ డిజైన్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ నిరీక్షణకు తెరదించుతూ నథింగ్ ఫోన్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. నథింగ్ ఫోన్ 1 ధర.. 30 వేలకు పైబడి ఉన్నా.. ఆపిల్, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ట్రాన్స్ప్రరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు గ్లిఫ్ ఇంటర్ఫేస్తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూడు వేరియంట్లలో నథింగ్ ఫోన్ 1 అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యాం + 128 జీబీ స్టోరేజ్ ధర – రూ.32,999 8జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్ ధర – రూ.35,999 12జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్ ధర – రూ.38,999 ఫ్లిప్ కార్ట్ లాంచింగ్ ఆఫర్: ఈ స్మార్ట్ ఫోన్ పై లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ. 1,000 తగ్గింపు ప్రకటించారు. అలాగే.. కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగించినట్లయితే 2,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది. మొత్తంగా 3,000 తక్షణ డిస్కౌంట్ వర్తిస్తుంది. దీంతో.. బేస్ మోడల్ 8జీబీ ర్యాం + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్.. రూ.29,999కు, 8జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్‌వేరియంట్.. రూ.32,999కు, 12జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్ వేరియంట్.. రూ.35,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్: 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లే+ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ (50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 + 50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్) 16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ .@nothing has launched its first-ever smartphone : Phone (1) at a starting price of Rs. 32,999. Specifications : ✔️ 6.55-inch OLED display ✔️Snapdragon 778G+ SoC ✔️50MP dual cameras ✔️4,500mAh battery ✔️33W fast charging#nothing #nothingphone1 #launched #latestlaunches pic.twitter.com/9LwTAOwtVz — GizNext (@GizNext) July 13, 2022 ఇక ఈ డివైజ్ వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ పాస్ తీసుకున్నవారికి ఇప్పటికే సేల్స్ మొదలయ్యాయి. కాగా, ఈనెల 21వ తేదీ రాత్రి 7 గంటలకు నథింగ్ ఫోన్ 1 సాధారణ సేల్ ప్రారంభమవుతుంది. ఆఫ్‌లైన్‌లో నథింగ్ పోన్ 1 కొనుగోలు కోసం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. నథింగ్ పోన్ 1పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.