మీకు వాట్సాప్ లో రెండు అకౌంట్లు ఉంటే బాగుండు అని భావిస్తున్నారా? మీ అవసరాలకు అనుగుణంగా రెండు వాట్సాప్ యాప్ అకౌంట్లను వాడుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెసేజ్ ఎడిట్ ఆప్షన్, షార్ట్ వీడియో రికార్డ్ వంటి ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ ద్వారా కావాల్సిన సమాచారాన్ని అవతలి వ్యక్తికి సులువుగా చేరవేయవచ్చును. టెక్ట్స్ రూపంలో, ఇమేజ్ రూపంలో, ఆడియో, వీడియో రికార్డ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకోవచ్చు. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే యూజర్లు అందరూ వాట్సాప్ యాప్ ను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో వాట్సాప్ లో రెండు అకౌంట్ లను ఒకే ఫోన్ లో వాడుకునే సౌలభ్యాన్ని అందించనుంది వాట్సాప్. ఆ వివరాలు మీకోసం..
సాధారణంగా కొన్ని స్మార్ట్ ఫోన్ లలో డ్యుయల్ యాప్ సాయంతో రెండు వాట్సాప్ యాప్ లను రెండు ఫోన్ నెంబర్లతో అకౌంట్ క్రియేట్ చేసుకుని వినియోగించుకునే వీలుంది. ఇలా కాకుండా రెండు అకౌంట్లను యూజ్ చేయాలనుకున్నప్పుడు రెండు ఫోన్ లు అవసరం అవుతాయి. కానీ ఇప్పుడు వాట్సాప్ ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ యాప్ లో రెండు అకౌంట్లను వాడుకునేలా అప్‌డేట్ చేయనుంది. ప్రస్తుతానికి ఈ అప్ డేట్ కొంత మంది బీటా యూజర్లకు టెస్టింగ్ నిమిత్తం అందుబాటులోకి తీసుకువచ్చారు.
మరో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే?
వాట్సాప్ యాప్ కొత్త అప్ డేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాక మీ ఫోన్ లో ఒకే వాట్సాప్ యాప్ లో రెండు అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ లోని క్యూఆర్ కోడ్ బటన్ పక్కన ఉన్న బాణం గుర్తుపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో అకౌంట్ ను యాడ్ చేసుకోవాలి. దీంతో ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ యాప్ లో రెండు అకౌంట్లను వాడుకోవచ్చు. వాట్సాప్ వినియోగదారులకు వారి అవసరాలకు తగిన విధంగా వాడుకునేలా ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుందని వాట్సాప్ వెల్లడించింది.