Nothing Phone(1): టెక్నాలజీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘నథింగ్ ఫోన్ 1’ మార్కెట్‌లోకి వచ్చేసింది. వన్‌ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ.. యూనిక్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించింది. మంచి ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ప్రీ బుకింగ్‌పై అందుబాటులో ఉన్న ఈ నథింగ్ ఫోన్.. సౌత్ ప్రజలను దారుణంగా అవమానించింది. సాధారణంగా ఏదైనా కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వస్తే వాటిని జనాలకు పరిచయం చేయటానికి ఆయా కంపెనీలు టెక్ యూట్యూబర్ల సహాయం తీసుకుంటాయి. తమ కంపెనీ ఫోన్ గురించి అన్‌బాక్సింగ్ ద్వారా ప్రజలకు తెలియజేయమని కోరుతుంటాయి. యూట్యూబర్లు ఆ ఫోన్‌ను అన్‌బాక్స్ చేసి, దాని గురించి వివరించి చెబుతూ ఓ వీడియో చేస్తారు. చాలా ఫోన్ల కంపెనీలు భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్‌బాక్సింగ్‌కు అవకాశం ఇస్తాయి. ఆయా ప్రాంతానికి, భాషకు చెందిన ప్రముఖ టెక్ యూట్యూబర్లకు ఫోన్‌లను ఫ్రీగా అందించి అన్‌బాక్సింగ్ చేయమంటుంటాయి. అయితే, నథింగ్ ఫోన్ 1 విషయంలో అలా జరగలేదు. సదరు ఫోన్ కంపెనీ సౌత్ ప్రజలను అవమానించేలా వ్యవహరించింది. సౌత్‌లోని ఏ టెక్ యూట్యూబర్‌కు అన్‌బాక్సింగ్ చేయటానికి ఫోన్‌ను అందించలేదు. కానీ, నార్త్‌లోని టెక్ యూట్యూబర్లకు అవకాశం ఇచ్చింది. అంతేకాదు! సౌత్‌లో ఒక్క ఫోన్ కూడా ఇవ్వని కంపెనీ.. నార్త్‌లోని ఒక్కో ప్రముఖ టెక్ యూట్యూబర్లకు ఐదేసి ఫోన్లు ఇచ్చిందట. అది కూడా నాలుగు ఫోన్లు గివ్ అవే కింద ఇవ్వడానికి. సౌత్‌లో నథింగ్ ఫోన్ అన్‌బాక్సింగ్ కోసం నథింగ్ కంపెనీని సౌత్ యూట్యూబర్లు సంప్రదించగా.. ఫోన్ సౌత్‌లోని రీజనల్ లాంగ్వెజ్ యూట్యూబర్లకు ఇవ్వమని చెప్పేసిందట. కేవలం ఈ కంపేనీనే కాదు.. ఎస్ సార్వోజీ ఫోన్ 6, శాంసంగ్ జెట్ ఫోల్డ్ సిరీస్, ఒప్పో రోలబుల్ ఫోన్ బ్రాండ్లు ఇండియా అంటే హిందీ మాత్రమే అన్న ఫీలింగ్‌లో ఉన్నాయంట. సౌత్‌లోని ప్రజలు అంత ఖర్చు చేసి తమ ఫోన్లు కొనలేరని చెబుతున్నాయంట. ఫోన్‌కు హైప్ క్రియేట్ చేసిన తమను పట్టించుకోవటం లేదని సౌత్‌లోని టెక్ యూట్యూబర్లు వాపోతున్నారు. గతంలో వన్ ప్లస్ 6 సమయంలో తెలుగు, తమిళం టెక్ యూట్యూబర్లను లాంఛ్‌కు పిలిచి.. ఓ టోపీ, ఓ గన్ ఇచ్చి పంపారంట. ఇక, నార్త్ యూట్యూబర్లకు ఫోన్లు ఇచ్చారంట. కొన్ని కంపెనీలు నార్త్‌లోని ఒక్కో టెక్ యూట్యూబర్‌కు నాలుగైదు ఫోన్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంట. మరి, సౌత్‌లోని తమిళనాడులో తయారీ కంపెనీ పెట్టి సౌత్ ప్రజలను అవమానించిన నథింగ్ కంపెనీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి: Nothing Phone (1): యూనిక్ డిజైన్ తో నథింగ్ ఫోన్1 గ్రాండ్ ఎంట్రీ.. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ధర!