ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. ఈవీ విభాగంలో రెండవ మోడల్ ను దుబాయ్ వేదికగా బుధవారం లాంఛ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.
ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. ఈవీ విభాగంలో రెండవ మోడల్ ను దుబాయ్ వేదికగా బుధవారం లాంఛ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. నేవిగేషన్ సిస్టం, లైవ్ వెహికల్ లొకేషన్ షేరింగ్, ఈవీ ఛార్జర్ మ్యాపింగ్ మెకానిజం వంటి ఫీచర్లతో ఈ ఈవీ వస్తుంది. 3.8 కిలో వాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఈ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 2.6 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
మోటార్ పీక్ పవర్ 11 కిలోవాట్ సామర్థ్యంతో వస్తుంది. ఎక్స్ టెల్త్, ఎక్స్ ట్రైడ్, ఎక్స్ఓనిక్ మూడు థ్రిల్లింగ్ మోడ్స్ లో వస్తుంది. దీని 3 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ తో గంటలో 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. సాధారణ ఛార్జర్ తో 3 గంటల 40 నిమిషాల్లో 80 శాతం వరకూ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనే సమయంలో సాధారణ హోమ్ ఛార్జర్ లేదా ఫాస్ట్ ఛార్జర్ ని ఎంపిక చేసుకోవచ్చు. సాధారణ పోర్టబుల్ ఛార్జర్ 950 కిలోవాట్ తో రూ. 16,275కే అందిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇక స్కూటర్ భద్రత కోసం నెక్స్ట్ జనరేషన్ ఏబీఎస్ టెక్నాలజీని వాడారు. వెల్ నెస్, గేమింగ్, బ్రౌజింగ్, లైవ్ వీడియో వంటి ఫీచర్స్ తో 10.2 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
ఈ స్కూటర్ ని స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ హెల్మెట్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇతరులెవరూ దీన్ని యాక్సెస్ చేయకుండా స్మార్ట్ షీల్డ్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్స్ షోరూం ధర రూ. 2,49,990గా నిర్ణయించింది. బుకింగ్ లు ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ ని టీవీఎస్ అధికారిక వెబ్ సైట్ లో రూ. 5 వేలతో రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వద్దు అనుకుంటే కనుక క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ రీఫండ్ ఇస్తారు. ఇది ప్రస్తుతం ఒకే రంగులో అందుబాటులో ఉంది. హెల్కట్ రెడ్ కలర్ లో వస్తుంది. 2024 జనవరి నెల నుంచి డెలివరీ అవుతుందని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొంది.