మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, అతని పేరు అలోక్ సాగర్ , మా ఊర్లోనే ఉంటాడు,అంతకు మించి మాకు ఏమి తెలియదు అని ఆ గ్రామస్థలు చెప్పారు, దీనితో కానిస్టేబుల్ తో పోలీస్ స్టేషన్ కి పిలిపించి తన దర్పాన్ని చూపించాడు సదరు ఎస్ పీ. పేరు ఏమిటి అని అడిగితె అలోక్ సాగర్ అని చెప్పాడు, గుర్తింపు కార్డు అడిగితె ఇక్కడికి తెచ్చుకోలేదు ఇంట్లో ఉంది, నేను భారతీయుడినే బయపడకు, నేను సామాన్య జీవితం బ్రతకడానికి ఈ గ్రామానికి వచ్చాను అని సమాధానం చెప్పాడు అలోక్ సాగర్. అయినా పోలీసులు వరసగా ప్రశ్నిస్తుంటే ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆవేశం తో ఊగిపోతూ పైకి లేచిన అలోక్ సాగర్ , ‘నా పేరు అలోక్ సాగర్ నేను ఢిల్లీ లో ఐ ఐ టీ ప్రొఫెసర్ , ప్రముఖ ఇండియన్ ఎకనామిస్ట్ అయినా రఘురామ్ రాజన్ నా శిష్యుడు, కావాలంటే విచారించుకో పో’ అని గట్టిగ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అలోక్ సాగర్. అలోక్ సాగర్ ఇచ్చిన షాక్ నుండి తేరుకున్న సదరు ఎస్ పీ అతని గురించి ఎంక్వయిరీ చెయ్యగా నిజమే అని తేలడం తో బెటాలియన్ ని వేసుకొని అలోక్ సాగర్ ఇంటికి వెళ్లి అతనిని అవమానించినందుకు క్షమాపణలు చెప్పారు.
అలోక్ సాగర్ ఇండియా లోని టాప్ 5 ఐ ఐ టీ ప్రొఫెసర్. అమెరికా లోపని హూస్టన్ యూనివర్సిటీ లో పీ హెచ్ డీ చేసిన ఈయన అక్కడే బోధనలు కూడా చేసేవాడు, అలా రఘు రామ్ రాజన్ కూడా ఈయన క్లాసులను చాలా ఆసక్తిగా అక్కడ వినేవాడు. అలోక్ రిటైర్ అయినా తరువాత ఊరిబయట గ్రామం లో ఉంటూ, అక్కడ మొక్కల్ని పెంచుతూ , గిరిజనులకు అవసరమైన ఆర్థిక సహాయాలు చేస్తూ అలా కాలాన్ని గడిపిస్తున్నాడు, ఆధునిక బిజీ ప్రపంచానికి దూరంగా మధ్య ప్రదేశ్ లోని ఒక్క మారు మూల గ్రామం లో అతి సాధారణ మనిషి లాగ బ్రతుకు ప్రకృతిని ప్రేమిస్తూ ,మొక్కలు నాటుతూ, తనకి తెల్సిన విద్య ని నలుగురికి పంచుతూ అలా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నాడు, అయితే అలాంటి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న అతని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఒక్కే ఒక్క సంఘటన.