ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యి దేశానికి సేవ చేయాలని చాలా మంది యువతీ యువకులు కలలుకంటారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతుంటారు. అంత కష్టపడి చదువుతున్న వీరిపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒక పక్క ఐఏఎస్ అయిన ఆనందం. మరోపక్క పండంటి బిడ్డకు తల్లి అయ్యానన్న సంతోషం. బిడ్డ పుట్టిన రెండు వారాలకే పోస్టింగ్ వచ్చింది. ఇంట్లో ఉండి బిడ్డను చూసుకోవాలా? కార్యాలయానికి వెళ్లి ఐఏఎస్ గా బాధ్యతలు చేపట్టాలా అన్న ప్రశ్న వస్తే ఆమె రెండిటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేశారు. ఒక చేత్తో బిడ్డను ఎత్తుకుని.. మరొక చేత్తో ఆఫీస్ పనులు చూసుకున్నారు. ఆమె మరెవరో కాదు సౌమ్య పాండే.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని అనేక మంది నిరూపిస్తూ వచ్చారు. ఈ విషయంలో ఆడవాళ్లు ఏమీ తక్కువ కాదు. పెళ్ళైన ఆడవాళ్లు కూడా అద్భుత విజయాలను సాధిస్తున్నారు. పెళ్ళైతే ఇక జీవితం అయిపోయింది అని అనుకునే మహిళలు చాలా మంది ఉంటారు. కానీ ఒక్కసారి చరిత్ర చూసుకుంటే పెళ్ళై, పిల్లలు పుట్టిన పుణ్య స్త్రీలు ఎందరో అద్భుతమైన విజయాలను సాధించారు. విజయాలను సాధించడం పక్కన పెట్టండి. చావు ఎదురొస్తున్నా.. బిడ్డను […]
అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా ప్రేక్షకులకు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యిందంటే.. సామాన్యులు.. అధికారులు, రాజకీయనాయకులు ఎలా పని చేయాలని ఆలోచిస్తారో.. తప్పు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారో.. వ్యవస్థలో ఏ మార్పులు రావాలని భావిస్తారో.. వాటన్నింటిని తెర మీద కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఆ సినిమా భారీ విజయం సాధించింది. మరి వాస్తవంగా ఇలా పని చేసే అధికారులుంటారా అంటే.. ఎందుకుండరు.. కాకపోతే వారి గురించి చాలా తక్కువగా బయటి […]
ప్రేమించిన యువతిని పొందడం కోసం నెలరోజుల్లోనే లక్షలు సంపాదించడం.. కొండలు పిండి చేయడం.. అసాధ్యం అనుకున్న ఫీట్లను సాధించడం వంటివి సినిమాల్లోనే చూస్తాం. వాస్తవ జీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదు. నూటికో కోటికో.. ఎక్కడో ఒక చోట అలాంటి వారు తారసపడుతుంటారు. వారు ప్రేమించిన వ్యక్తి కోసం జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. ఆ వ్యక్తి శాంసంగ్ కంపెనీలో కోట్ల రూపాయల వేతనం వచ్చే కొలువులో […]
తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి పేరు ఖరారైంది. శాంతికుమారిని నూతన సిఎస్ గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సిఎస్ గా ఆమె బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎస్ గా మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే ప్రథమం. తెలంగాణ గత సిఎస్ సోమేశ్ కుమార్ సొంత రాష్ట్రమైన ఏపికి వెళ్లాలంటూ హైకోర్టు సూచించడంతో తదుపరి సిఎస్ ను నియామించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సిఎస్ సోమేశ్ కుమార్ ను రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంద్రప్రదేశ్ […]
‘‘విక్రం సింగ్ రాథోడ్ ఐపీఎస్.. ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. నాలుగు సంవత్సరాల సర్వీస్‌లో నాలుగు ప్రమోషన్లు.. 10 ట్రాన్ఫర్లు.. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనమాట’’ అని విక్రమార్కుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. విక్రం సింగ్ రాథోడ్ గురించి చెబుతూ పోలీస్ ఉన్నతాధికారి ఈ మాటలంటాడు. దేశంలో నిక్కచ్చిగా.. అవినీతికి పాల్పడకుండా.. పై ఆఫీసర్లు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేయకుండా ఉండే ప్రతీ ఒక్క సిన్సియర్ పోలీస్ అధికారి రికార్డు కూడా ఇదే. సిన్సియర్‌గా ఉండేవారికి ఇబ్బందులు, […]
భారతదేశంలో చాలా మంది ఉద్యోగాలకు ట్రై చేస్తుంటారు. కానీ ఎక్కువ మంది యువత లక్ష్యం మాత్రం IAS, IPS లు కావడమే. ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ దేశానికి సేవచెయ్యాలనే తపన వారిలో ఉంటుంది. అయితే షార్ట్ కట్ లో సివిల్స్ ఎగ్జామ్ అంత కఠినమైన పరీక్ష మరోకటి ఉండదని పేరుకూడా ఉంది. అదీకాక సివిల్స్ పరీక్ష ఏటా లక్షల మంది రాస్తున్నప్పటికీ.. సివిల్స్ క్లియర్ చేసేవారి సంఖ్య మాత్రం వందల్లో ఉంటుంది. మరి ఇంతటి క్రేజ్, […]
ఐఏఎస్ అవ్వాలని చాలా మంది కలలు కంటుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. కానీ, అది సాధించటం కొంతమంది వల్ల మాత్రమే అవుతుంది. పేదరికంలో మగ్గిపోయే వారికి నిజంగా చెప్పాలంటే ఐఏఎస్ అనేది కష్టసాధ్యమైనది. ఎందుకంటే ఇందుకోసం ఖరీదైన పుస్తకాలను కొనాల్సి ఉంటుంది. కోచింగ్ సెంటర్లకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధారణ ప్రజలకు ఆర్థిక భారాన్ని పెంచేస్తాయి. దీంతో వారు వీటికి దూరంగా ఉంటూ ఉంటారు. కానీ, నూటికి ఒకరిద్దరు మాత్రమే ఉన్న వనరులతో కష్టపడి చదివి […]
Tamil Nadu: ప్రేమ అందరి జీవితాల్లో తియ్యని జ్ఞాపకం అవ్వదు.. కొందరి మనసుపై మాయని గాయంలా మారి నిత్యం వేధిస్తుంటుంది. అదే గాయం మనసుతో పాటు మెదడును చేరితో మతి చలిస్తుంది. ప్రేమ వైఫల్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. మరెంతో మంది పిచ్చి వాళ్లుగా మారి ప్రతి నిత్యం ఛస్తూ బతుకుతున్నారు. ప్రేమ కోసం పిచ్చివాళ్లలా మారిన వారిలో పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యావంతులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ […]