కరోనాకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వచ్చి మరింత కలవర పెడుతోంది. ఇప్పుడు తాజగా కరోనాతో ఊపిరి తిత్తుల వ్యాధి మాత్రమే కాదు రక్తం కూడా గడ్డ కడుతుందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగులలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి) అని పిలువబడే రక్తం గడ్డకట్టే ప్రాబల్యం 14-28 శాతం అలాగే ధమనుల త్రంబోసిస్‌కు 2-5 శాతం ఉందని చెబుతున్నాయి. భారతదేశంలోనూ ఇటువంటి పరిస్థితులను గుర్తించారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఊపిరితిత్తుల ముప్పుతో పాటు రక్తం గడ్డకట్టడం అనే ముప్పుకూడా భారత్ లో ఎక్కువగానే ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకూ అంతే హాని జరుగుతోంది కరోనాకు రక్తం గడ్డకట్టడానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు అధ్యయనాలకు సంబంధించిన విశ్లేషణలను ద లాన్సెట్ జనరల్ గతేడాది నవంబర్‌లో ప్రచురించింది. తాజాగా కరోనా వైరస్ కేవలం ఉపిరి తిత్తులపైను ప్రభావం చూపడం లేదని రక్తనాళాలకు సంబంధించిన వ్యాధిగా కూడా దీనిని పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో 14-28 శాతం రోగుల్లో రక్తం గడ్డకడుతోందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లలో రక్తం గడ్డ కడుతోందని అంటూన్నారు.