రక్తదానం మహాదానం అని అంటారు.. మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు చేసే రక్తదానం ఒక మనిషి ప్రాణాలు నిలబెడుతుంది. రక్తదానానికి పేదా, ధనిక అనే తేడాలు ఉండవు.. ప్రాణాలు పోయే సమయంలో రక్తదానం చేసి కాపాడిన వారిని దేవుడితో సమానాంగా చూస్తారు.
మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు అత్యవసర ఆదుకునేది రక్తం.. ఆ సమయంలో రక్తదానం చేసిన వారు దేవుడితో సమానంగా చూస్తారు. అందుకే అంటారు రక్తదానం మహాదానం అని. మనకు బంధువువైనా సరే.. మిత్రుడైనా సరే లేదా పరాయి వారైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఒకే బ్లెడ్ గ్రూప్ వారైతే రక్తదానం చేసి కాపాడితే.. వారిని జీవితంలో మర్చిపోలేరు. జూన్ 14 ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ సందర్భంగా ఎన్నో రక్తదాన శిభిరాలు జరుగుతుంటాయి.. రక్తదానాన్ని మహాదానంగా పేరు పెట్టారు. అలాంటిది ఓ మహిళ తన 80 ఏళ్ల వయసులో ఏకంగా 96 లీటర్ల రక్తాన్ని దానం చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూఎస్ కి చెందిన జోసెఫిన్ మిచాలుక్ వయసు 80 సంవత్సరాలు.. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా రక్తదానం చేసినందుకు గాను వరల్డ్ గిన్నిస్ రికార్డు లో చోటు దక్కించుకున్నారు. 1955 లో జోసెఫిన్ తన 22 ఏళ్ల వయసులో తొలిసారిగా రక్తదానం చేశారు. ఆమె తన సోదరి ప్రోత్సాహంతో నిస్వార్థమైన ఈ సేవాకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఎవరు ఏ ఆపదలో ఉన్నా వెంటనే తాను అక్కడికి వెళ్లి మరీ రక్తదానం ఇవ్వడం ఆరంభిచారు. ఇప్పటి వరకు ఆమె ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఇప్పటి వరకు జోసెఫిన్ 203 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు.. అంతే దాదాపు ఇది 96 లీటర్లతో సమానం.
తన జీవిత కాలంలో ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి నిస్వార్థంగా రక్తదానం చేస్తూ వారి ప్రాణాలు రక్షిస్తూ వచ్చినందుకుగాను జోసెఫిన్ మిచాలుక్ గిన్నిస్ రికార్డు వారు సత్కరించారు. 80 ఏళ్ల వయసు ఉన్న జోసెఫిన్ ఇప్పటికీ రక్తదానాన్నికొనసాగిస్తూ వస్తున్నారు. రక్త దానానికి వయో పరిమితి లేకపోవడం.. అందులోనూ ఆమె 80 ఏట కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండటం వల్ల రక్తదానం చేస్తున్నారు. జోసెఫిన్ వరల్డ్ గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకోవంతో ఆమె బంధుమిత్రులు, అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. ఇలాంటి గొప్ప మహిళలు ఎంతో అరుదుగా ఉంటారని.. ఆమె మంచి మనసుకు జోహార్లు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తనకు గిన్నిస్ రికార్డు రావడంపై జోసెఫిన్ మాట్లాడుతూ.. ‘ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం.. నా పేరుపై గిన్నిస్ రికార్డు ఉంటుందని నేనెప్పుడూ ఊహించుకోలేదు.. అయినా నేను చేసింది రికార్డుల కోసం కాదు.. ఆపదలో ఉన్నవారిని రక్షించాననే సంతృప్తి నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక ముందు కూడా నా సేవలు కొనసాగిస్తూనే ఉంటాను’ అన్నారు. జోసెఫిన్ బ్లెడ్ గ్రూప్ ‘ఓ’ పాజిటీవ్. అమెరికా ఆస్పత్రుల్లో ఈ బ్లెడ్ గ్రూప్ చాలా అరుదు.. ఎంతో డిమాండ్ ఉంది. అమెరికా జనాభాలో 37 శాంతం మందికి ఇదే బ్లెడ్ గ్రూప్ గలవారు ఉన్నారు. ఏది ఏమైనా రక్తదానం చేయాలంటే భయపడేవారు.. జోసెఫిన్ ధైర్యాన్ని, సేవా గునాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
She has donated more than her own body weight in blood over the years.https://t.co/tVJ3h2ZKqO
— Guinness World Records (@GWR) March 26, 2023