కరోనా వైరస్ వణికిస్తుంటే ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అని పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. మ్యుకర్ మైకోసిస్ ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వారిలో, […]
కరోనాకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వచ్చి మరింత కలవర పెడుతోంది. ఇప్పుడు తాజగా కరోనాతో ఊపిరి తిత్తుల వ్యాధి మాత్రమే కాదు రక్తం కూడా గడ్డ కడుతుందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగులలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి) అని పిలువబడే రక్తం గడ్డకట్టే ప్రాబల్యం 14-28 శాతం అలాగే ధమనుల త్రంబోసిస్‌కు 2-5 శాతం ఉందని చెబుతున్నాయి. భారతదేశంలోనూ ఇటువంటి పరిస్థితులను గుర్తించారు. నిపుణులు చెబుతున్న […]
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వీటి కొరత తీవ్రతరం అయింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కాన్సంట్రేటర్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వాతావరణంలో ఉండే ప్రాణవాయువును ఉపయోగించి శుద్ధి చేయబడిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆక్సిజన్‌ను హెచ్ఎఫ్ఎన్‌సికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ప్రజలకు ఇళ్ల దగ్గర కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెంచుకోవడానికి ఈ కాన్సంట్రేటర్లు బాగా ఉపయోగపడతాయి. అయితే ఇది కేవలం నిమిషానికి రెండు, మూడు […]
జీవన్‌దాన్!… అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ కల్పించడంలో విశేష కృషి చేస్తోంది. బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది. దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాల్లో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది. బ్రెయిన్‌డెడ్ అయిన దాతల నుంచి అవయవాలను సేకరించి […]