కరోనాకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వచ్చి మరింత కలవర పెడుతోంది. ఇప్పుడు తాజగా కరోనాతో ఊపిరి తిత్తుల వ్యాధి మాత్రమే కాదు రక్తం కూడా గడ్డ కడుతుందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగులలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి) అని పిలువబడే రక్తం గడ్డకట్టే ప్రాబల్యం 14-28 శాతం అలాగే ధమనుల త్రంబోసిస్‌కు 2-5 శాతం ఉందని చెబుతున్నాయి. భారతదేశంలోనూ ఇటువంటి పరిస్థితులను గుర్తించారు. నిపుణులు చెబుతున్న […]
కరోనా సంక్షోభం అనేక కుటుంబాల్లో సృష్టిస్తున్న విలయం అంతాకాదు ఇంతాకాదు. శాశ్వతంగా తమకు దూరమైన ఆప్తులకు కనీసం కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా వీలులేక అల్లాడిపోతున్నాయి.ఈ క్రమంలో రాజస్థాన్‌లో షాకింగ్ ఉదంతం ఒకటి కలకలం రేపింది. కరోనాతో మృతి చెందిన తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన మండుతున్న చితిపై దూకేసింది. ఇటీవలే తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె తండ్రి చితిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అక్కడున్నవాళ్ళందర్నీ కంట తడిపెట్టించింది. రాజస్థాన్ బార్మెర్ జిల్లా […]
కర్ణాటకలో కరోనా విలయతాండం చేస్తోంది. రోజురోజుకీ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం కరోనా రోగులతో బెడ్లన్నీ నిండిపోవడంతో ఆస్పత్రుల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులకూ కూడా కరోనా సోకితే బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి తన పరిస్థితి వివరిస్తూ కంటతడి పెట్టుకోవడం సంచలనంగా మారింది. ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది రోగులు మృత్యువాతపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గుంటూరు, విజయనగరం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పలువురు రోగులు మరణించిన సంగతి తెలిసిందే.ఈ ఘటన మరచిపోక ముందే తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఎనిమిది మంది కరోనా రోగులు మరణించారు. అయితే వీరంతా ఆక్సిజన్ అందకనే మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా […]
కొవిడ్ కేసుల తీవ్రతతో ఆసుపత్రుల్లో పడకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న పాజిటివ్ రోగులకు తగ్గట్లుగా పడకలు అందుబాటులో తీసుకురావటం అధికారులకు సవాలుగా మారింది. కొత్త రోగులకు పడకలు దొరక్కపోవడం డిశ్ఛార్జులు తక్కువగా ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోలుకున్నా కొందరు ఆస్పత్రులను వీడి బయటకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారు వెంటనే ఇళ్లకు వెళ్లాలని, అత్యవసరమైన వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పెరుగుతున్న రోగులను తట్టుకునేలా ప్రత్యామ్నాయ విధానాలతోపాటు డిశ్ఛార్జులపై ప్రత్యేక డ్రైవ్ […]
కరోనా పరీక్షల్లో జరుగుతున్న దోపిడీ. పలు ప్రైవేటు వైద్యశాలలు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క మహమ్మారి బారిన పడి అల్లాడుతున్న పేషెంట్లు మరో దిక్కులేక వారు అడిగినంత సమర్పించుకుని రిపోర్టులతో బయట పడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు లేకపోవడంతోనే జనం ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఉన్నదే దోచుకునేందుకు అన్నచందంగా తయారయ్యాయి. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వెళ్తే […]
రోజు రోజుకు కరోనా రెండో దశ వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. దీంతో కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రిలో బెడ్స్ దొరకక, ప్రాణవాయువు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకడం ఎంతో కష్టంగా మారింది. ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన సంఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు […]
కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు దుర్మరణం చెందారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఎనిమిది మంది రోగులు మృతిచెందారు. భారుచ్ -జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది. […]