బిగ్ బాస్ సీజన్-5 విజేత ఎవరో చెప్పేసిన గూగుల్

బిగ్ బాస్ స్పెషల్- ప్రస్తుతం తెలగు రియాల్టీ షోలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బాగా పాపులర్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు నార్మల్ గానే కనిపించిన షో, ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అంతకంతకు హౌజ్ హీటెక్కుతోంది. బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏంజరుగుతుందోనని అందరిలో ఉత్కంట రేగుతోంది.

ఇఖ బిగ్ బాస్ షో 19 మంది కంటెస్టెంట్లతో మొదలైతే, ఇద్దరు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం ఈ షోలో 17 మంది ఉన్నారు. బిగ్‌బాస్‌ ఏ టాస్క్‌ ఇచ్చినా కంటెస్టెంట్స్ అంతా పోటాపోటీగా పెర్మామెన్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్‌ గెలిచి తీరాలన్న లక్ష్యంతో అందరు కసిగా ఆడుతున్నారు. చివరికి బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Bigboss 1

ఇదిగో ఇటువంటి సమయంలో గూగుల్‌ మాత్రం అప్పుడే ఈ సీజన్‌ విన్నర్ ను ప్రకటించింది. అదేంటీ ఇంకా బిగ్ బాస్ షో పూర్తవ్వకముందే విజేతను ఎలా ప్రకటిస్తారని అనుకుంటున్నారా.. అదే ఎవ్వరికి అర్ధం కావడం లేదు. బిగ్ బాస్ షో మొదలై కేవలం రెండు వారాలే అవుతున్నప్పటికీ సింగర్‌ శ్రీరామచంద్ర విన్నర్‌ అని గూగుల్ డిసైడ్ చేసేసింది. శ్రీరామ్‌ అభిమానులు గూగుల్‌ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసింది అంటూ సంబరాలు చేసుకుంటుంటే, నెటిజన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.

అసలు సంగతి ఏంటంటే.. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్ లో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-5 విన్నర్‌ ఎవరని టైప్‌ చేస్తే, వెంనే.. శ్రీరామచంద్ర పేరును చూపిస్తోంది గూగుల్. శ్రీరామ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, నటుడు అని, ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 5 విజేత అని కూడా పూర్తి వివరాలను చూపిస్తోంది గూగుల్. బిగ్ బాస్ షో ముగియక ముందే తొందరపడి కూస్తోందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి చివరికి బిగ్ బాస్ టైటిల్ ను ఎవరు దక్కించుకుంటారో అన్నది తేలాలంటే మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.