గూగుల్ లో పని చేయాలని ఎంతోమంది డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ జీతం ఇస్తుంది కాబట్టి. అసలు గూగుల్ కంపెనీలో పని చేసే ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయో తెలుసా?
గూగుల్ తల్లి లేకపోతే పనులవ్వవు. ఈ గూగుల్ తల్లిని నమ్ముకునే కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్ నే అడిగే పరిస్థితి. గూగుల్ మీద ఆధారపడి మొత్తం ప్రపంచమే జీవిస్తుంది. అలాంటి సంస్థలో పని చేసే ఉద్యోగులు చాలా గర్వంగా ఫీలవుతారు. గూగుల్ లో ఉద్యోగం సంపాదించడం అంటే అదొక లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ లా ఫీలవుతారు. మన ఇండియన్స్ కూడా గూగుల్ లో జాబ్స్ దక్కించుకున్నారు. అయితే ఈ గూగుల్ లో పని చేసే ఉద్యోగుల జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలుసు. కానీ ఏ మాత్రం ఉంటాయనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
ప్రపంచంలో అత్యధిక శాలరీలు అందిస్తున్న సంస్థల్లో గూగుల్ ఒకటన్న విషయం మనకి తెలిసిందే. అయితే తాజాగా గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు చెల్లించే జీతాలకు సంబంధించి డేటా లీకయ్యింది. వివిధ విభాగాలను బట్టి ప్యాకేజ్ అనేది ఉంటుందని సదరు నివేదిక వెల్లడించింది. 2022లో గూగుల్ సంస్థలో పని చేసే ఉద్యోగి కనీస జీతం 2,79,802 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం సుమారు రూ. 2.30 కోట్లు. 2022లో గూగుల్ సంస్థ చెల్లించిన గరిష్ట ప్రాథమిక వేతనం రూ. 7,18,000 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 5.90 కోట్లు. గూగుల్ లో పని చేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాథమిక జీతం రూ. 6 కోట్లుగా నివేదిక వెల్లడించింది. గూగుల్ సంస్థలో అందరి కంటే ఎక్కువ జీతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లదే.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు 7,18,000 డాలర్లు, ఇంజనీరింగ్ మేనేజర్ 4 లక్షల డాలర్లు, ఎంటర్ప్రైజ్ డైరెక్ట్ సేల్స్ ఉద్యోగులు 3,77,000 డాలర్లు తీసుకుంటున్నారు. లీగల్ కార్పొరేషన్ కౌన్సిల్ సేల్స్ 3,20,000 డాలర్లు తీసుకుంటుండగా.. సేల్స్ స్ట్రాటజీ ఉద్యోగులు 3,15,000 డాలర్లు జీతం పొందుతున్నట్లు నివేదిక వెల్లడించింది. యుఎక్స్ డిజైనర్ జీతం 3,15,000 డాలర్లు ఉండగా.. గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఉద్యోగులకు 3,12,000 డాలర్లు ఉంటుందని నివేదిక వెల్లడించింది. రీసెర్చ్ సైంటిస్ట్ లకు 3,09,000 డాలర్లు, క్లౌడ్ సేల్స్ ఉద్యోగులకు 3,02,000 డాలర్లు, ప్రోగ్రాం మేనేజర్లకు 3 లక్షల డాలర్లు పే చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.
Google employees’ salaries leaked, software engineers paid ₹6 crore: Report pic.twitter.com/ywkLz7QEAW
— Balanced Report (@reportbalanced) July 20, 2023