ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. ఈవీ విభాగంలో రెండవ మోడల్ ను దుబాయ్ వేదికగా బుధవారం లాంఛ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.
ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చినప్పటికే వెంటనే లోన్ ప్రక్రియ పూర్తవ్వదు. అందుకోసం చాలా సార్లు బ్యాంకుకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుకి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఉండి కూడా లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా అప్లై చేసి 15 రోజుల్లోనే ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. తక్కువ వడ్డీకే విద్యా రుణాన్ని అందించే పథకం ఒకటి ఉంది. అదే విద్యాలక్ష్మి పథకం.
మొబైల్ చేతిలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, ఎక్స్ వంటి యాప్స్‌ను వినియోగించకుండా ఉండలేం. పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఏదో ఒక యాప్‌ను వినియోగిస్తూనే ఉంటాం.
నిజం గొంతు నొక్కేస్తూ అవినీతి మీడియా ఛానల్ లో పని చేస్తూ ఇమడలేక ఇబ్బందులు పడే జర్నలిస్టులకు.. వాస్తవాన్ని బయటపెట్టిన కారణంగా ఉద్యోగం కోల్పోయిన జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇక నుంచి వీరంతా ఎక్స్ అనే మీడియా కంపెనీలో నెల నెలా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చునని ట్వీట్ చేశారు.
పంచదారలో అయితే ఏకంగా థర్మాకోల్ షీట్స్ ని పొడి చేసి కలుపుతున్నారు. కొందరు రసాయనాలను కలుపుతున్నారు. టీ పొడి, కారప్పొడి వంటి వాటిలో ఇటుకల పొడి కలిపి అమ్మేస్తున్నారు. మరి ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?