మీ దగ్గర ఈ ఐఫోన్లు ఉంటే కనుక కంపెనీ రూ. 5 వేలు ఇస్తుంది. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!
యాపిల్ కంపెనీ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆ కంపెనీ చేసిన ఐఫోన్ లంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ పిచ్చెక్కిపోతారు. ఐఫోన్ వాడడాన్ని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఇదిలా ఉంటే కొన్ని ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ కంపెనీ రూ. 5 వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కొన్ని ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలోని పెర్ఫార్మెన్స్ తగ్గినట్టు అనుభూతి చెందినట్లైతే వారికి యాపిల్ కంపెనీ నష్టపరిహారం అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇప్పటి ఐఫోన్లకు కాదు.. ఒక అర్ధ దశాబ్దం క్రితానికి వెళ్తే అప్పుడు వచ్చిన ఐఫోన్ 6, ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ వినియోగదారులకు మాత్రమే ఈ పరిహారం వర్తిస్తుంది.
ఉద్దేశపూర్వకంగా యాపిల్ కంపెనీ డివైజ్ పెర్ఫార్మెన్స్ ని తగ్గించిందని తలెత్తిన వివాదం కారణంగా యాపిల్ కంపెనీ పరిహారం చెల్లించాలని 2020లో కోర్టు తీర్పునిచ్చింది. అయితే యాపిల్ కంపెనీ మాత్రం తమ ఉద్దేశాలు హానికరం కావని కంపెనీ తెలిపింది. అయితే 2020లో ఐఫోన్ యూజర్లకు 500 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఒప్పుకుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ ఫోన్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వినియోగదారులకు యాపిల్ కంపెనీ పరిహారం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లీగల్ అడ్వకేట్ టైసన్ రెడెన్ బార్గర్ ఒక్కో ఐఫోన్ యూజర్ కి 65 డాలర్లు పరిహారం అందుతుందని అన్నారు.
భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 5,300 పరిహారం అందనుంది. ఆకస్మిక షట్ డౌన్ లను నిరోధించడానికి యాపిల్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా అప్పటి ఫోన్ల వేగాన్ని తగ్గించింది. అయితే ఈ విషయం పట్ల వినియోగదారులు సంతృప్తి చెందలేదు. కొంతమంది ఐఫోన్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అందరూ కలిసి కోర్టులో 2018లో యాపిల్ కంపెనీ మీద పిటిషన్ వేశారు. దానికి అనుగుణంగా తీర్పు రావడంతో యాపిల్ కంపెనీ పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది.