స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడటం అనవరమని.. డబ్బు- సమయం వృథా చేసుకుంటున్నారంటూ చాలా మంది వాదిస్తుంటారు. అయితే స్మార్ట్ వాచెస్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక యాపిల్ స్మార్ట్ వాచ్ ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది.
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్.. ఇండియా మీద ఫోకస్ పెడుతోంది. ఆ కంపెనీ ఇక్కడ రాబోయే మూడేళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వనుందని తెలుస్తోంది.
యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు, డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ సంస్థ మొదటి నుంచి భారతదేశం విషయంలో ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది. భారత్ లో ఆఫ్ లైన్ స్టోర్స్ కూడా స్థాపించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు చైనాలోని ప్లాంట్ ను ఇండియాకి తరలిస్తున్నట్లు చెబుతున్నారు.
యాపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ కి సంబంధించి కొత్త కొత్త మోడల్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అయితే ఐఫోన్ 15 విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా ఆ మోడల్ కి సంబంధించిన రెండర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఐఫోన్ 15కి సంబంధించిన ఫీచర్లు కూడా ఇప్పుడు లీకయ్యాయి.
ఐఫోన్ కొనాలి అనేది చాలా మంది కల. ఐఫోన్ డిజైన్, లుక్స్, సెక్యూరిటీ ఫీచర్లు చూసే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ, ఇప్పుడు ఐఫోన్ ని కూడా హ్యాక్ చేసేందుకు వీలుంటుంది అని వస్తున్న వార్తలు యూజర్లను కంగారు పెడుతున్నాయి.
ఐఫోన్.. ఎన్ని కంపెనీల ఫోన్లు ఉన్నా కూడా దీని క్రేజ్ వేరే లెవల్. చాలామంది మధ్యతరగతి వారికి ఈ ఫోన్ కొనుక్కోవాలనేది కల. కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఈ ఫోన్ కొనుక్కోలేకపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఐఫోన్లపై కూడా ఆఫర్లు వస్తూ ఉంటాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఈ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో మధ్యతరగతి వాళ్లు కూడా ఈ ఐఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే ఐఫోన్ […]
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఎవరిని తొలగిస్తారో కూడా తెలియని పరిస్థితి. సింపుల్ గా ఒక మెయిల్ పెట్టేసి మిమ్మల్ని తొలగిస్తున్నాం అంటూ చెబుతున్నారు. అది ఫ్రెషర్స్ నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. చిన్నా చితక కంపెనీలు, స్టార్టప్ లు మాత్రమే కాదు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం లేఆఫ్స్ కి వెళ్లారు. గూగుల్ అయితే రాబోయే అనర్థాలను ఆపడానికే ఇలా […]
టెక్ ప్రపంచంలో యాపిల్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన ఫోన్లు మాత్రమే కాదు.. స్మార్ట్ వాచ్, ఎయిర్ పోడ్స్ ఇలా ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. పైగా యాపిల్ కంపెనీ నుంచి ఫోన్స్, గ్యాడ్జెట్స్ సరికొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటు పడిన వాళ్లు మార్కెట్ లోకి కొత్త మోడల్ రాగానే దానిని కొనేస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయనట్లు కనిపిస్తోంది. యాపిల్ […]
టెక్నాలజీ రంగంలో యాపిల్ సంస్థ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. ఫోన్ల దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్ వరకు యాపిల్ తీసుకొచ్చిన దాదాపు ప్రతి ప్రాడక్ట్ సూపర్ హిట్టయ్యిందనే చెప్పాలి. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ లాంటి అంశాలకు పెద్దపీట వేసే యాపిల్.. అధునాతన ఫీచర్లను ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతర పోటీ కంపెనీలను వెనక్కినెడుతూ వస్తోంది. క్వాలిటీ పరంగా మిగతా బ్రాండ్ల డివైజ్‌లతో పోల్చుకుంటే యాపిల్ ఉత్పత్తులు చాలా బాగుంటాయనే పేరుంది. అయితే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా మధ్యతరగతి […]
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ త్వరలోనే భారత్‌లో రిటైల్ స్టోర్లను తెరవబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి దశలో 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. 2021 జనవరి ఆరంభంలో యాపిల్ సంస్థ సీఈవో ‘టిమ్ కుక్’ మాట్లాడుతూ, ఆన్‌లైన్ స్టోర్లకు దేశంలో అద్భుతమైన స్పందన లభించిందని, భవిష్యత్తులో రిటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. […]