పంచదారలో అయితే ఏకంగా థర్మాకోల్ షీట్స్ ని పొడి చేసి కలుపుతున్నారు. కొందరు రసాయనాలను కలుపుతున్నారు. టీ పొడి, కారప్పొడి వంటి వాటిలో ఇటుకల పొడి కలిపి అమ్మేస్తున్నారు. మరి ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?
వంటలో వాడే మసాలా దినుసుల్లో ముఖ్యమైనది కారం. మిర్చి పొడి అని కూడా అంటారు. కారం లేకపోతే రుచి ఉండదు. వెజ్, నాన్ వెజ్ వంటకం ఏదైనా సరే కారం ఉండాల్సిందే. పూర్వీకులు ఎండు మిర్చిని రోలులో మెత్తగా దంచి పొడిగా చేసి దాన్ని వంటకాల్లో అంత తీరిక లేకపోవడం వల్ల మార్కెట్లో ప్యాకెట్ పొడులు కొనేసుకుంటున్నారు. బయట మార్కెట్లో రకరకాల కంపెనీల కారప్పొడులు అందుబాటులో ఉన్నాయి. అయితే కొంతమంది డబ్బుకు కక్కుర్తి పడి ఆహార పదార్థాలను కల్తీ చేసి అమ్మేస్తున్నారు. టీ పొడి, కారప్పొడి వంటి వాటిలో ఇటుకల పొడి కలిపి అమ్మేస్తున్నారు. పంచదారలో అయితే ఏకంగా థర్మాకోల్ షీట్స్ ని పొడి చేసి కలుపుతున్నారు. కొందరు రసాయనాలను కలుపుతున్నారు.
ఇలా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశకు పోయి నీచానికి దిగజారుతున్నారు. ఆ కల్తీ ఆహార పదార్థాలను తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే మనం కొనుగోలు చేసే కారప్పొడి అసలుదో, నకిలీదో గుర్తుపట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మిర్చి పౌడర్ లో రసాయనాలు, పలు పదార్థాలు కలుపుతారు. వాటిలో కృత్రిమ రంగు, ఇటుక పొడి, రంపపు పొడి, సుద్ద పొడి, ఊక, సబ్బు, ఎర్ర మట్టి, చెడిపోయిన మిరపకాయలు వంటివి కలిపి మిర్చి పొడిని తయారు చేస్తున్నారు. ఆకర్షణీయంగా ఉండడంతో వీటిని కొనుగోలు చేసి అనారోగ్యానికి గురవుతున్నారు.
కల్తీ ఆహార పదార్థాలను గుర్తించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో ఒక చెంచాడు మార్కెట్లో కొన్నటువంటి మిర్చి పొడిని కలపాలి. నీటి ద్వారా మిర్చిలో ఉన్న అవశేషాలను చేతులకు రాసుకుని గమనించండి. చర్మానికి గరుకుగా తగిలితే అందులో ఇటుక పొడి కలిపినట్లు అర్థం. అదే మిర్చి పొడి సబ్బులా మరీ స్మూత్ గా అనిపిస్తే సబ్బు కలిపినట్టు అర్థం చేసుకోవాలి. వినియోగదారుల ఫారంలో ఫిర్యాదు చేయవచ్చు. అలానే ఆ బ్రాండ్ మిర్చి పొడిని కొనడం మానేయాలి.