ఫిల్మ్ డెస్క్- దివి తెలుసు కదా.. బిగ్ బాస్ రియాల్టీ షో కంటే ముందు పెద్దగా పరిచయం లేని దివి, ఆ తరువాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలుస టీవీ షోలో కాదు, సోషల్ మీడియాలో పోస్టులతో అభిమానులకు హీట్ పుట్టిస్తోంది దివి. టాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న దివి, సోషల్ మీడియాలో చాలా యాక్డీవ్ గా ఉంటుంది.
తాజాగా తన ఒళ్లుని విల్లులా వంచి వివిధ భంగిమల్లో యోగాసనాలు వేసింది దివి. తన నాజూకు అందాల గ్లామర్ సీక్రెట్ ఇదేనంటూ చెప్పకనే చెప్తూ ఈ భంగిమల్ని తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ముందు మోడల్ గా గ్రామర్ ఫీల్డ్ లోకి ఎంటరైన దివి, ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించడంతో హీరోయిన్ మెటీరియల్ అయ్యిందని చెప్పవచ్చు.
అన్నట్లు దివికి మెగాస్టార్ చిరంజీవి కూడా మెగా ఆఫర్ ఇచ్చారు. బిగ్ బాస్ ఫినాలే వేదిక మీద నుండి చిరంజీవి వేదాళం రీమేక్‌లో అవకాశం ఇచ్చిన విషయం అందరికి తెలుసు. అయితే హీరోయిన్గా మాత్రం దివికి ఇంకా అవకాశం రావడం లేదు. అందుకే దర్శకులు, నిర్మాతల కళ్లల్లో పడేందుకు ప్రయత్నిస్తోంది దివి.
ఇందులో భాగంగానే అవకాశం దొరకినప్పుడుల్లా సోషల్ మీడియలో రెచ్చిపోతోంది దివి. తన హాట్ ఫోటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తున్న దివి, ఇప్పుడు తన యోగాసనాలకు సంబందించిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. తన ఒళ్లును విల్లులా వంచి యోగా చేస్తూ, తన గ్రామర్ సీక్రెట్ యోగానే అని చెప్పకనే చెప్పింది దివి.