అంతర్జాతీయ స్థాయి నుండి భారత దేశానికి పాకిన రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో కాస్త ఆలస్యంగా మొదలైన ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. విమర్శలు వస్తున్నప్పటికీ.. దీనికి దక్కుతున్న ఆదరణ వేరే లెవల్.
అంతర్జాతీయ స్థాయి నుండి భారత దేశానికి పాకిన రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో కాస్త ఆలస్యంగా మొదలైన ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. విమర్శలు వస్తున్నప్పటికీ.. దీనికి దక్కుతున్న ఆదరణ వేరే లెవల్. బయట ప్రపంచమంటే ఏంటో తెలియకుండా..ఎంచుకున్న కొంత మంది సభ్యుల మధ్య కొన్ని రోజుల పాటు ఓ హౌస్ లో గడిపే గేమ్ ఇది. ప్రేమల, ఆప్యాయతలు, అలకలు,కోపాలు, గొడవలు వంటి నవరసాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఈ షోల్లో చాలా మంది నటీనటులు పాల్గొన్నారు. కొంత మంది కొత్త ముఖాలు కూడా వచ్చి తర్వాత సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. కొంత మంది తెలిసినా.. ఫేమ్ వచ్చింది మాత్రం బిగ్ బాస్‌తోనే. వారిలో ఒకరు నేహా చౌదరి. ఆమెకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంది.
యాంకర్, డ్యాన్సర్, యోగా ట్రైనర్, మోడల్, జిమ్నాస్ట్‌తో పాటు అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ 6 సీజన్లలో పాల్గొన్న ఈ పొడుగుకాళ్ల సుందరి.. మూడవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంది. ఇంజనీరింగ్ సమయంలో ఇష్టపడ్డ అనిల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం ఆమె జర్మనీ వెళ్లిపోయింది. అనిల్ అక్కడే ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఆమె అక్కడకు వెళ్లింది. యూట్యూబ్ లో తన ఛానల్ చూసేవారికి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. అలాగే భర్తతో కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తూ నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. అయితే పెళ్లి అయ్యి ఆరు నెలలు అయ్యిందో లేదో అప్పడే భర్తను ద్వేషిస్తున్నానంటూ ఓ పోస్టు పెట్టింది.
అందులో ‘నేను నిన్ను ఎంతో ద్వేషిస్తున్నాను. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకే అనుకుంటా దీన్ని పెళ్లి అని పిలుస్తారు. నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్, కేక్స్ వంటివి నాకివ్వకుండా నువ్వొక్కడివే తినేసినా.. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు నాకు సారీ చెప్పి, మళ్లీ చేయనని చెప్పి..మాటిచ్చిన ఐదు నిమిషాలకే తప్పులు చేస్తావు. అయినప్పటికీ.. నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమించే విధానానికి నేను పడిపోయా. నువ్వు ఎప్పటికీ నావాడివే’ అని ఇన్ స్టాలో తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది.