బుల్లి తెర సీరియల్స్ ద్వారా పరిచయమైంది నటి హిమజ. భార్యామణి, స్వయంవరం వంటి సీరియల్స్ నటించిన ఆమె. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంతో ఆమె చాలా పాపులరయ్యింది. అచ్చ తెలుగు పదాహారాణాల తెలుగు అమ్మాయిలా... లంగా, ఓణీల్లోనే కనిపించేది. గుంటూరు జిల్లాలోని వీరపాలెంలో పుట్టిన ఈ చిన్నది
బుల్లి తెర సీరియల్స్ ద్వారా పరిచయమైంది నటి హిమజ. భార్యామణి, స్వయంవరం వంటి సీరియల్స్ నటించిన ఆమె. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంతో ఆమె చాలా పాపులరయ్యింది. అచ్చ తెలుగు పదాహారాణాల తెలుగు అమ్మాయిలా.. లంగా, ఓణీల్లోనే కనిపించేది. గుంటూరు జిల్లాలోని వీరపాలెంలో పుట్టిన ఈ చిన్నది.. సాయి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కించిన ‘సర్వాంతర్యామి’ అనే టెలీ ఫిలింలో తొలిసారి హిమజ నటించింది. హిమజ తండ్రి మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ టెలీఫిల్మ్‌కు నిర్మాత. చదువు పూర్తయ్యాక పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిన్నది.. తొలుత సీరియల్స్, ఆ తర్వాత సినిమాల్లో నటించింది. బిగ్ బాస్-3 రియాలిటీ షోలో కూడా మెప్పించింది.
రామ్ శివమ్, నేను శైలజ, ఉన్నటి ఒకటే జిందగీతో పాటు శర్వానంద్ మహానుభావుడు, శతమానం భవతి, జనతా గ్యారేజ్, ధృవ, వినయ విధేయ రామ, స్పైడర్, చిత్రలహరి, ఆవిరి, వరుడు కావలెను, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో మెప్పించింది అమ్మడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. దుస్తులు, నగలకు, ఇతర ప్రొడక్ట్స్‌కు సంబంధించిన ప్రమోషన్లు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ హడావుడి చేస్తుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటిది అయ్యింది. ఆ విషయాన్ని పంచుకున్న హిమజ.. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. తన సొంతింటి కల నేరవేరిందంటూ పేర్కొంది.
‘గృహప్రవేశం.. కొత్త ఇల్లు అనేది జ్ఞాపకాల కోసం ఒక ప్రదేశం. సొంతింటి కల నేరవేరింది. ఈ మైలు రాయిని చేరకున్నందుకు నాకు నేను అభినందనలు చెప్పుకుంటున్నాను. నాతో ఉంటూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లవ్ యు ఆల్’అంటూ పోస్టు పెట్టింది.
నటి, తన కృషితో, సంపాదనతో నాలుగంతస్తుల అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. ఆమెకు సిరి హన్మంత్, అరియానా గ్లోరీ, సనా తదితరులు అభినందనలు తెలియజేశారు. అయితే ఇటీవల ఆమె ఈ గృహ ప్రవేశానికి సంబంధించి షాపింగ్ చేయగా.. వాటిని తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసిన సంగతి విదితమే.