బిగ్ బాస్-5 సీజన్‌లో సందడి చేసింది లహరి శారీ. అర్జున్ రెడ్డి, జాంబి రెడ్డి, మళ్లీరావా, పేపర్ బాయ్, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమాలతో రానీ ఫేమ్, నేమ్ బిగ్ బాస్‌తో వచ్చింది. ఇప్పుడు
తెలుగు టెలివిజన్‌లో రియాలిటీ షో అనగానే గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. ఈ షోలో ఎంతో మంది నటీనటులు పాల్గొని, తమ ఆట తీరును ప్రదర్శించారు. ప్రేక్షకులకు తెలియని కొత్త ముఖాలు కూడా ఈ షోకు వచ్చి తరువాత పాపులారిటీని తెచ్చుకుంటాయి. అటువంటి వారిలో ఒకరు లహరి శారీ. బిగ్ బాస్-5 సీజన్‌లో సందడి చేసింది. అర్జున్ రెడ్డి, జాంబి రెడ్డి, మళ్లీరావా, పేపర్ బాయ్, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమాలతో రానీ ఫేమ్, నేమ్ బిగ్ బాస్‌తో వచ్చింది. హౌస్‌లో నుండి వివాదాల కారణంగా తర్వగా బయటకు వచ్చేసింది. ఇంత మంది సింగిల్ మెన్ ఉండగా.. లహరి తన వెంట పడుతుందని యాంకర్ రవి చెప్పాడంటూ ప్రియ అనడం.. రవి ఆమెపై ఫైర్ అవ్వడం జరిగింది. ఈ వివాదాల కారణంగా బయటకు వచ్చిన చిన్నది.. తర్వాత పలు సినిమాల్లో నటించింది.
వివాదాలతో మూడవ వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి తర్వగా బయటకు వచ్చింది. తరువాత పలు సినిమా అవకాశాలు వచ్చాయి. శాకినీ, డాకినీ, గనీ వంటి సినిమాలతో మెరిసింది. అయితే ఆమెకు అంతగా బ్రేక్ రాలేదనే చెప్పాలి. చిన్న చిన్న పాత్రలు వస్తుండగా.. ఆమె కెరీర్ మాత్రం అంత ఆశాజనకంగా లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫోటో షూట్లు, ఇతర ఫోటోలను పంచుకుంటుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక.. అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకాడటం లేదు ఈ బ్యూటీ. హాట్ అండ్ బోల్డ్ ఫోటో షూట్లతో కుర్రకారును రెచ్చగొడుతుంది. టెంప్టీ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సమ్మర్‌లో మరింత హిట్ ను పెంచుతున్నాయి. బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేస్తూ షూటింగ్ వైబ్స్ అంటూ కొటేషన్ పెట్టింది.
ఇందులో నైట్ వెదర్‌లో మంచంపై కూర్చొని ఒక్కోక్క ఫోజ్ ఇచ్చింది. షర్ట్ గుండీలు విప్పేసి బోల్డ్ షోతో చెమటలు పట్టించింది. ప్రస్తుతం లహరి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఒక్కొక్క యాంగిల్ లో మంచంపై కూర్చుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. ఫేమస్ అవ్వడం కోసం, అవకాశాలా కోసం అందాల ఆరబోతకు సిద్ధమైంది. కురచ దుస్తులతో ఫోటో షూట్లలో పాల్గొంటూ హీట్ పెంచుతుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. దీంతో నెటిజన్లు సైతం ఆమె అందాలకు ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు. క్వీన్ లా ఉన్నావని, వెరీ ప్రిటీ, లుకింగ్ గుడ్ అంటూ కొంత మంది కామెంట్లు పెడుతుంటే… మరికొంత మంది చెత్త కామెంట్లతో రెచ్చిపోతున్నారు.