ప్రముఖ హీరోయిన్ ఇలియానా డీ క్రూస్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిండి తినే పరిస్థితి కూడా లేకపోవటంతో శనివారం వైద్యులు ఆమెకు సెలైన్స్ ఎక్కించారు. దాదాపు మూడు బాటిళ్ల సెలైన్స్ నీళ్లను నరాల ద్వారా శరీరంలోకి ఎక్కించారు. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తన అనారోగ్యం గురించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టోరీస్ పెట్టారు. ఆ స్టోరీస్‌లో.. ‘‘ ఓ రోజులో ఎంత మార్పు. మంచి డాక్టర్లు.. 3 బ్యాగుల […]
ఒక చేత్తో చేసే సాయం మరొక చేతికి తెలియకూడదని కొంతమంది నమ్ముతుంటారు. చేసిన దానాలు, చేసిన సహాయాలు బయటకి చెప్పుకోరు. ఎప్పుడో.. ఎవరో సాయం పొందిన వారు చెప్తే తప్ప.. చిరంజీవి లాంటి వ్యక్తుల గురించి బయటకు తెలియదు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో కష్టం ఉందని వెళ్తే.. వెంటనే సహాయం చేస్తారు. అయితే ఆర్థిక సహాయం, లేదంటే మాట సహాయం చేస్తారు. తన మాట వల్ల ఒక మనిషికి ప్రయోజనం చేకూరుతుందంటే.. వెంటనే సంబంధిత వ్యక్తులతో మాట్లాడి […]
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన తన నివాసం రెండో అంతస్తు మీద నుంచి కింద పడిపోయి తుది శ్వాస విడిచారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆయన మృత్యువాతపడ్డారు. కాగా, శ్రీనివాస మూర్తి మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ […]
అలనాటి మేటి తార, టాలీవుడ్ సత్యభామ జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వయోభార సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. జమున మృతిపై సీఎం జగన్, చిరంజీవి, బాలకృష్ణలతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు తమ సంతాపం తెలిపారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఫిలిం ఛాంబర్‌కు […]
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. పెళ్లి ఎప్పుడని అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వచ్చిన శర్వానంద్ మొత్తానికి మ్యారేజ్‌కు సిద్ధమైపోయారు. గురువారం (జనవరి 26న) రక్షితా రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో శర్వా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత.. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు కావడం గమనార్హం. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రక్షిత.. కరోనా వ్యాప్తి […]
టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఫ్యామిలీస్‌లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీనుంచి సీనియర్ ఎన్టీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. వారిలో కొంతమంది ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా పరిశ్రమలోకి వచ్చి తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన తాత పోలికలతో పాటు నటనను కూడా పునికిపుచ్చుకున్నారు. అందుకే స్టార్ హీరోగా లక్షల మంది అభిమానుల ప్రేమను పొందుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే జూనియర్ […]
సినీ ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఫలానా హీరో, హీరోయిన్ లేదా ఫలానా డైరెక్టర్ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని కొందరు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. సినిమాల్లో నటించాలనుకునే వారిని మాయమాటలతో నమ్మించి, మూవీస్‌లో చాన్సులు ఇప్పిస్తామంటూ వారి దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక పేరు చెప్పి ఓ వ్యక్తికి రూ.20 లక్షలు టోకరా వేశాడు. ఈ ఘటన మరువక ముందే ఇలాంటి […]
తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తికి తెలుగు నాట ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. రియల్ లైఫ్‌లో బ్రదర్స్ అయిన వీరిద్దరి సినిమాలు చూసేందుకు తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీళ్ల సినిమాలు తెలుగు, తమిళంలో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఈ స్టార్ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం సూపర్ హిట్స్ తో రచ్చ చేస్తున్నారు. ‘ఆకాశం […]
పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఎక్కడైనా కామన్. టాటూ అనేది ఎవర్‌గ్రీన్ ట్రెండ్ అనే చెప్పాలి. చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ల పేర్లు, నచ్చిన గుర్తులు, రకరకాల సింబల్స్ లాంటి వాటిని తమ శరీరంపై టాటూగా వేయించుకుంటారు. అక్కడ, ఇక్కడ అనే తేడాల్లేకుండా దాదాపుగా అన్ని చోట్ల ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. మన దేశంలోనూ ఈ కల్చర్ ఉంది. ముఖ్యంగా ఫిల్మ్, స్పోర్ట్ సెలబ్రిటీల్లో ఇది ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇకపోతే, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్న జరిగిన ‘‘వీర సింహారెడ్డి’’ సక్సెస్ మీట్‌లో బాలయ్య బాబు మాట్లాడుతూ.. ‘‘ అక్కినేని, తొక్కినేని’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందా? అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా పేరున్న నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య మొదటినుంచి ఎంతో […]