రాజకీయాల్లో మగవాళ్లే నెగ్గుకు రావడం కష్టంగా ఉన్న రోజుల్లో ఆడవాళ్లు గద్దెనెక్కి, పరిపాలన చేసి ఔరా అనిపించారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండేది ఇందిరా గాంధీ. దేశ తొలి, ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధాని. దేశానికి దిశా, నిర్ధేశకం లేని సమయంలో పగ్గాలు చేతబట్టిన ఆమె.. భారత్ పేరు నలుమూలలా వినబడేలా చేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని అనేక మంది రాజకీయాల్లోకి వచ్చిన వారున్నారు.
‘లేచిందీ, నిద్ర లేచిందీ మహిళా లోకం, దద్దరిల్లీంది పురుష ప్రపంచం’ అని ఎన్టీఆర్ ఆనాడే చెప్పాడు. అది నిజమే మరీ. రాజకీయాల్లో మగవాళ్లే నెగ్గుకు రావడం కష్టంగా ఉన్న రోజుల్లో ఆడవాళ్లు గద్దెనెక్కి, పరిపాలన చేసి ఔరా అనిపించారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండేది ఇందిరా గాంధీ. దేశ తొలి, ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధాని. దేశానికి దిశా, నిర్ధేశకం లేని సమయంలో పగ్గాలు చేతబట్టిన ఆమె.. భారత్ పేరు నలుమూలలా వినబడేలా చేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని అనేక మంది రాజకీయాల్లోకి వచ్చిన వారున్నారు. వస్తున్నారు. ఆ తర్వాత మాయవతి, మమతా బెనర్జీ, జయలలిత, సోనియా గాంధీ వంటి వారెందరో రాజకీయాల్లోకి వచ్చి తమ పేర్లను లిఖించుకున్నారు. అటువంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా. ప్రస్తుతం ఆమె పేరు తెలుగు నేలపై వినబడుతూనే ఉంటుంది.
ఈ ఫోటోలో పైన కనిపిస్తున్న చిన్నారిని చూశారా. బుట్టబొమ్మలా అందంగా పిల్లవాడిని తదేకంగా చూస్తున్న ఆమె ఎవరో తెలుసా.. ప్రముఖ రాజకీయ నేత. ఇంతకు ఆమె ఎవరునుకుంటున్నారా. మన తెలుగు నేల అయిన తెలంగాణలో ఆమె పేరు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆమెనే తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరర్ రాజన్. ప్రస్తుతం పుదుచ్చురి లెఫ్టినెంట్‌గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె.. తొలి నుండి రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబంలోనే పెరిగారు. ఆమె తండ్రి కాంగ్రెస్ మాజీ నేత కుమారి అనంతన్. 1961లో ఇదే రోజున ఆమె జన్మించారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో కుమారి అనంతన్ మరియు కృష్ణ కుమారి దంపతులకు జన్మించింది . మద్రాసు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. సౌందరరాజన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త కూడా వైద్యుడే. వీరికి సుగనాథన్ అనే కుమారుడు ఉన్నాడు.
ఆమె రాజకీయ జీవితం మాత్రం వింతగానే సాగింది. ఓటమి ఎదురైనా బెదరలేదు. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ అభ్యర్థిగా తూత్తుకుడి నుండి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే డీఎంకె అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. అయితే ఆమె పార్టీ మాత్రం గుర్తింపు నిచ్చింది. 2017లో ఆమెను కేంద్ర ప్రభుత్వం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆ తర్వాత 22019లో తెలంగాణ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. 2021లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవరర్నర్‌గా అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించారు. ఎప్పుడూ కూల్‌గా ఉండి పాజిటివ్‌గా స్పందిస్తుంటారు. ఆమెపై పలు మీమ్స్ వస్తుంటాయి. అయినా వారిపై చర్యలు తీసుకోకపోగా.. చాలా ఫన్నీగా సమాధానాలు ఇస్తుంటారు.