యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, జోష్ వంటి యాప్స్‌లో తమ వీడియోలను పోస్టు చేసి ఫేమస్ అయ్యారు కొందరు. వారిలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయలున్నారు. యూట్యూబ్ వీడియోలు, సిరిస్ లతో వీరంతా ఫేమస్ అయ్యారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డ షన్ను, దీప్తిలు... బిగ్ బాస్ 5 తర్వాత విడిపోయారు. అయితే ఇప్పుడు షన్ను చేసిన ఓ పనికి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
సోషల్ మీడియా వచ్చాక ఎవ్వరైనా సెలబ్రిటీలు కావొచ్చు అని అనేక మంది నిరూపించారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోయారు. టిక్ టాక్ (ప్రస్తుతం బ్యాన్ చేశారు లెండి), యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, జోష్ వంటి యాప్స్‌లో తమ వీడియోలను పోస్టు చేసి ఫేమస్ అయ్యారు కొందరు. ఆ తర్వాత వారికి స్టార్ హోదా కూడా వచ్చింది. వీరితో అనేక మంది నటీనటులయ్యారు. మరికొంత మంది తమ ఫేమ్ ను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్. థియేటర్లతో సందడి చేసే ఒక్క సినిమాలో, టివి సీరియల్స్‌లో నటించలేదు. కానీ అతడికి యువతలో పిచ్చ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కేవలం యూట్యూబ్‌లో ఆయన చేసిన సిరీస్, సీరియల్స్ ద్వారానే పేరు తెచ్చుకున్నాడు.
అరే ఏంట్రా ఇది అనే డైలాగ్ షణ్ముఖ్ జస్వంత్‌తోనే ఫేమస్ అయ్యింది. యూట్యూబ్‌లో పలు వెబ్ సిరీస్ లో నటించిన ఇతగాడికి మంచి పేరు తెచ్చిన సిరీస్‌లు మాత్రం సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్, సూర్యలే. ఇవి ఎంతటి పేరు తెచ్చాయంటే.. ఒక్కసారిగా స్టార్ హీరో స్థాయిని సొంతం చేసుకున్నాడు షన్ను. అదే సమయంలో్ మరో యూట్యూబర్ దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ వారి పేర్లను టాటూలుగా కూడా వేయించుకున్నారు. ఇక వీరూ పెళ్లి చేసుకోవడం తరువాయి అనుకుంటుండగా బిగ్ బాస్ -5లో షణ్ముఖ్‌కు అవకాశం వచ్చింది. అందులోకి వెళ్లాక అవకాశాలేమో కానీ , అతడి కొంప ముంచింది. మరో యూట్యూబర్ సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రొమాన్స్ రచ్చతో వీరిద్దరూ విడిపోయారు. ఎవరికి వారు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ బతికేస్తున్నారు.
ఇటీవల వీరిద్దరూ చెరో సింగిల్ సాంగ్స్ తో దూసుకు వచ్చారు. జానూ అంటూ షన్ను, ఏమోనే అంటూ దీప్తి వచ్చారు. ఇందులో ఏమోనే మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా మరో పాటతో అభిమానులను పలకరించారు షన్ను. దీంతో అతడిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయమేమిటంటే.. అయ్యోయ్యో అనే పేరుతో కొత్త సాంగ్ చేశారు. ఇందులో ఫణి పూజిత అనే యువతితో షన్ను రొమాన్స్ చేశారు. ఓ సీన్‌లో కిస్, హగ్‌లతో రెచ్చిపోయాడు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. ఇది చూసిన నెటిజన్లు దీప్తినుద్దేశించి కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీప్తి బాధపడుతుంది బ్రో అని, ఆమె మీద రివేంజా అని, అరే ఏంట్రా ఇది అంటూ కొంత మంది మండిపడుతుండగా… మరికొంత మంది దీపూ ఇలా చేస్తే నీకెలా ఉంటుంది. నువ్వు ఎంత చేసినా మాకు దీపు-షన్నునే కావాలి, ఏదో కాలిన వాసన వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.