అధికారంలోకి రావడం కోసం నేతలు పలు ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తారు. వీటిలో ఎక్కువ శాతం ఉచిత హామీలే ఉంటాయి. సాధ్యసాధ్యాలు ఆలోచించకుండా.. ఉచిత పథకాల హామీలిచ్చి.. జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించాకా.. వాటిని నిలబెట్టుకునేందుకు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన హామీలను నేరవేర్చేందుకు సరిపడ ఆర్థిక వనరులు ఉండవు. ఫలితంగా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం కోసం సీఎం జగన్ కూడా నవరత్నాల పేరిట ఇలాంటి హామీలు అనేకం ఇచ్చాడు. ఇక రాష్ట్రంలో అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా లేవు.
దీని వల్ల ఖజనాపై పెను భారం పడుతుంది. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయాలా చేశారని విపక్షాలు ఆరోపిస్తుండగా.. తాజాగా సొంత పార్టీ నేతలు సైతం జగన్ పథకాలపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రామాచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Jagan: టెన్త్ ర్యాంకులు ప్రకటిస్తే జైలుకే.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం!
రామచంద్రయ్య మంగళవారం కడప పురపాలక మైదానంలో నిర్వహించిన వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజలు సైకిల్ అడిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు కొనిస్తున్నారని, ఇలాగైతే రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ‘జగన్ ప్రజలు అడిగినవీ, అడగనివీ కూడా నెరవేరుస్తున్నారు’ ఇది ఇలానే కొనసాగితే.. కష్టం అన్నారు.
ఇది కూడా చదవండి: Sonia Gandhi And Rahul Gandhi: సోనియా, రాహుల్ లకు ED నోటీసులు! జగన్ జోలికి వస్తే.. తిప్పలు తప్పవా?
గతంలో ఎన్నడూ చూడని విధంగా కేసీ కెనాల్ ఆయకట్టు బీడుగా మారిందని అన్నారు. కెనాల్లో నీళ్లున్నా రైతులు వరి పంట వేయకుండా పొలాలను బీళ్లుగా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. చెన్నూరు చక్కెర కర్మాగారం తెరిస్తే వందలమంది రైతులు బాగుపడతారని, పరిశ్రమ పునరుద్ధరణ కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చాలని రైతులను రామచంద్రయ్య కోరారు. మరి జగన్ పథకాలపై రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: KTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘జగన్ నాకు పెద్దన్నలాంటి వాడు.. చంద్రబాబుతో విభేదాల్లేవ్’!