ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఏకంగా చిడతలు వాయిస్తూ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. తన నేతలు అసెంబ్లీని ఎంత పవిత్రంగా భావిస్తారో ఉదహరించడానికి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురించి ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు!
భాస్కర్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీకి వచ్చినా చెప్పులు వేసుకోరని.. కారణం ఏంటో తెలుసుకోవాలనిపించి ఓ సమయంలో తాను.. దీని గురించి చెవిరెడ్డిని అడిగానన్నారు. అందుకు చెవిరెడ్డి బదులిస్తూ.. ‘నేను అసెంబ్లీని దేవాలయంగా భావిస్తానని.. అందుకే చెప్పులు వేసుకుని రాను’ అని తనతో చెప్పినట్లు అంబటి వివరించారు. తామంతా అసెంబ్లీని దేవాలయంలా భావిస్తుంటే.. టీడీపీ సభ్యులు తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!
అంతేకాక 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేని అన్నారు. నిన్న విజిల్స్ వేశారు, ఇవాళ చిడతలు వాయించారు రేపు సభలో ఏం చేస్తారో..?. సభలో అమర్యాదగా ప్రవర్తించిన టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు. టీడీపీ సభ్యులు సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.