Vishal Response On Contesting In Kuppam Against Chandrababu Naidu: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉన్నప్పటికి.. అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కీలక నియోజకవర్గాల్లో.. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచో జోరుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓడించాలని అధికార వైసీపీ వ్యూహరచన చేస్తోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై కుప్పంలో హీరో విశాల్ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
చంద్రబాబు నాయుడు పై పోటీ చేసే విషయమై విశాల్ మాట్లాడుతూ.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తనను ఎవరు సంప్రదించలేదన్నారు. ఈ మేరకు విశాల్ ట్వీట్ చేశాడు. ‘‘నేను ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను అని.. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లను నేను విన్నాను. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీని గురించి నాకు ఏం తెలియదు.. కుప్పంలో పోటీ గురించి నన్ను ఎవరు సంప్రదించలేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎవరు ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. నా వరకు నాకు సినిమాలే ముఖ్యం. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలనే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. చంద్రబాబు నాయుడిపై పోటీ చేసే ఉద్దేశం నాకు అసలు లేదు’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలువతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Vishal (@VishalKOfficial) July 1, 2022