మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెంగళ వెంకట్రావ్ విరుచుకుపడ్డారు. మందు తాగుతావా లేదా చెప్పాలంటూ అనితకు సవాల్ విసిరారు. కాపు కులస్తుడైన తన భర్తను పోలీస్‌స్టేషన్లో చెప్పుతో కొట్టడమే కాకుండా… జైలుకు పంపించిన ఘనత ఈ వీర వనితదని గుర్తుచేశారు. ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. కాపులను కించపరిచిన అనితను చంద్రబాబు పాయకరావు పేట ఇంచార్జ్, పోలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించారు అని ఎద్దేవా చేశారు. ఇక ఎమ్మార్వో వనజాక్షిని కొట్టిన మీరు.. మహిళల గురించి మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు.
‘‘కొన్ని రోజుల క్రితం అనిత.. మద్యం బాటిళ్లను ఎదురుగా పెట్టుకుని.. ఇవన్ని కల్తీ మద్యం బాటిళ్లు అని చెప్పింది. అసలు అవి నకిలీవని అనితకు ఎలా తెలుసు. అంటే ఆమె మద్యం సేవిస్తుంది కాబట్టి. వాటి టేస్ట్ ఆమెకు తెలుసు కాబట్టి.. అలా చెప్పగలిగింది. అనితకు ఓ సవాల్.. నెల రోజుల పాటు నీ ఇంటి తలుపులు, నా ఇంటి తలుపులు తెరిచి ఉంచుదాం. పోలీసులు బ్రీత్ అనలైజర్ తీసుకువచ్చి చెక్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది. ఎవరు తాగుబోతులో. మరొక్కసారి మా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురించి దుర్భషలాడితే.. నీ నాలుక తెగ్గొస్తాను’’ అంటూ చెంగళ వెంకట్రావ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Chintamaneni Prabhakar: అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ప్రభుత్వంపై చింతమనేని పిటిషన్!
ఇది కూడా చదవండి: Nagababu: కోనసీమ వివాదం.. సజ్జలపై విరుచుకుపడ్డ నాగబాబు.. ఏకంగా వెధవ అంటూ!