టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామా వ్యవహారం గత రెండు రోజులుగా ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆమె తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించింది. కాసేపటికే ఆ రాజీనామా ట్వీట్ డిలీట్ చేసింది. అప్పటి నుంచి దివ్యవాణి రాజీనామా వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె బుధవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అనంతరం ఓ వీడియోని రిలీజ్ చేశారు. జూన్ 2న అంటే గురువారం రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో బుధవారం ఆమె భేటీ అయ్యారు. ఈ సమావేశం నుంచి బయటకొచ్చిన కాసేపటికే దివ్యవాణి ఈ ప్రకటన చేయడం ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అక్కడ నాకు అందిన మర్యాదను తట్టుకోలేకపోయా అంటూ దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి యదార్థతను చూడలేకే తాను టీడీపీ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనను ఇంతవరకూ ఆదరించిన టీడీపీ పెద్దలను దేవుడు బహుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ దివ్యవాణి కాస్త వ్యంగం ధ్వనించేలా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: అలా అయితే.. TDP ప్రతిపక్షంలోనే ఉండిపోతుంది: చంద్రబాబు!
‘‘టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు.. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న అంశంపై చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేందుకు వెళ్లాను. మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ ఆఫీస్‌కు వెళ్లగా.. ఆయణ్ని కలిసే సరికి రాత్రి 7.45 గంటలు దాటిపోయింది. చంద్రబాబు నాయుడు బయల్దేరే సమయం కావడంతో ఆయణ్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు హడావుడి చేశారు. నాకు కూడా టైమ్ లేకపోవడం వల్ల హడావుడిగా మాట్లాడాల్సి వచ్చింది’’ అని దివ్యవాణి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Ayyanna Patrudu: చంద్రబాబు మీటింగ్ లో జై జగన్ నినాదాలు! ఇందులో నిజమెంత?
‘లోపల ఏం జరిగింది? సార్, నేను ఏం మాట్లాడాను అనేది రేపు ఉదయం మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. వాళ్ల మర్యాదను తట్టుకోలేక, అక్కడ యదార్థతను చూడలేక నేను టీడీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నా. నన్ను ఇంతవరకూ ఆదరించిన టీడీపీ పెద్దలను, లోపలున్న వాళ్లందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూర్తి వివరాలు రేపు చెబుతా.. అర్థమైందిగా’ అంటూ దివ్యవాణి వీడియోను ముగించారు. దివ్యవాణి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: వైకాపా పాలనపై మహానాడులో తీవ్రస్థాయిలో విరుచుకుపడిన చంద్రబాబు!