షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత 'పఠాన్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. కొన్నేళ్లుగా సాలిడ్ హిట్స్ లేక సతమతమవుతున్నవాడు కాస్త పఠాన్ తో రయ్ మని పైకి లేచాడు. తాజాగా 'పఠాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. చాలా గ్యాప్ తర్వాత.. ‘పఠాన్‘ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. కొన్నేళ్లుగా సరైన సాలిడ్ హిట్స్ లేక వెనకబడిన బాలీవుడ్ ని.. పఠాన్ తో పైకి లేపాడు. భారీ అంచనాలు, భారీ ట్రోల్స్ మధ్య విడుదలైన పఠాన్.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ.. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోంది. జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో రిలీజైన పఠాన్ మూవీ.. వరల్డ్ వైడ్ పాజిటివ్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన న్యూస్ వచ్చేసింది.
పఠాన్ బ్లాక్ బస్టర్ తో దేశవ్యాప్తంగా షారుఖ్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ప్లాప్స్ లో మగ్గిపోయి.. ఒక్కసారిగా ఊహించని విజయంతో కంబ్యాక్ చేసేసరికి వాళ్లకు కూడా థ్రిల్లింగ్ గానే ఉంది. స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీసిన పఠాన్ మూవీని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే.. విలన్ గా జాన్ అబ్రహం నటించారు. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు షారుఖ్ స్క్రీన్ ప్రెజన్స్, దీపికా గ్లామర్ సినిమాకు బాగా కలిసొచ్చాయి. అన్నింటినీ మించి సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్సుతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.
ఈ క్రమంలో ఏ సినిమా రిలీజైనా ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని వెయిట్ చేసే ఆడియెన్స్ కి పండగ లాంటి వార్త బయటకొచ్చేసింది. పఠాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్… మార్చి 22 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ చేయనుంది. దీంతో యాక్షన్ మూవీస్ ని ఇష్టపడేవాళ్లు అప్పుడే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. దానికి తోడు షారుక్ కమ్ బ్యాక్ మూవీ కాబట్టి.. ఇంట్లోనూ చూసి థ్రిల్ అయ్యేందుకు సిద్ధమైపోతున్నారు. మరి ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
we sense a turbulence in the weather, after all Pathaan is coming!#PathaanOnPrime, Mar 22 in Hindi, Tamil and Telugu @iamsrk @deepikapadukone @TheJohnAbraham #SiddharthAnand @yrf pic.twitter.com/MnytnUqZEj
— prime video IN (@PrimeVideoIN) March 20, 2023