కొత్త సినిమాలతో శుక్రవారం థియేటర్ల వద్ద ఎంతటి సందడి నెలకొంటుందో.. ఓటీటీ ఫ్యాన్స్ కూడా వారంలో వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‍ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ప్రతి వారంలాగానే ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆకట్టుకోబోతున్నాయి.
కొత్త సినిమాలతో శుక్రవారం థియేటర్ల వద్ద ఎంతటి సందడి నెలకొంటుందో.. ఓటీటీ ఫ్యాన్స్ కూడా వారంలో వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‍ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ప్రతి వారంలాగానే ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆకట్టుకోబోతున్నాయి. ఇందులో క్రైమ్ థ్రిల్లర్ దగ్గర నుండి ప్రతి జోనర్‌లో మూవీలు ఉండబోతున్నాయి. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన తెలుగు, తమిళ సినిమాలు కూడా అలరించేందుకు సిద్ధమౌతున్నాయి. కొరియన్ డ్రామాలు కూడా ఉండబోతున్నాయి. ఈసారి ఏకంగా 30 చిత్రాలు, వెబ్ సిరీస్‌లు మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేయనున్నాయి. సో ఓటీటీ లవర్స్ ఆ సినిమా, వెబ్ సిరీస్ లిస్ట్ మీ కోసమే.
ఇటీవల థియేటర్లలో సందడి చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హిడింబ. అశ్విన్ బాబు, నందితా శ్వేత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 10 రాత్రి 7 గంటల నుండి ఆహాలో సందడి చేయనుంది. ఇక అన్నపూర్ణ ఫోటో స్టూడియో, బీమదేవర పల్లి బ్రాంచ్ వంటి సినిమాలు రాబోతున్నాయి. కాగా, కొన్ని పరభాష సినిమాలు కూడా తెలుగు డబ్బింగ్ చేసుకుని వచ్చేస్తున్నాయి. వాటిల్లో ఇటీవల తమిళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చి విశేష ఆదరణ కూడగట్టుకున్న సినిమా పొర్ తొళిత్. తెలుగుతో సహా నాలుగు భాషల్లో సోనీ లివ్స్‌లో సందడి చేయనుంది. కార్తీకేయన్ మూవీ మావీరన్.. కూడా తెలుగు వర్షన్‌లో కనువిందు చేయనుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి.
సందడి చేస్తున్న/చేయబోతున్న మరికొన్ని సినిమాలు/వెబ్ సిరీస్‌లు
మాయన్(తమిళ్)-ప్రైమ్ వీడియో
రెడ్, వైట్ అండ్ రాయల్ బ్లూ(ఇంగ్లీష్)-ప్రైమ్
సత్య ప్రేమ్ కీ కథ (హిందీ)-ప్రైమ్(రెంట్ బేసిస్)
పారాసైట్(కొరియన్)-సోనీలివ్
బ్రోకర్(కొరియన్)-సోనీలివ్
కాన్ఫిడెన్షియల్ అసైన్‌మెంట్-2(కొరియన్)- సోనీలివ్
ద ఫేబుల్ మాన్స్ (ఇంగ్లీష్)-సోనీ
వాన్ ముంద్రు-తమిళ్-ఆహా తమిళ్
నేమర్-నాలుగు భాషల్లో-హాట్ స్టార్
హార్ట్ ఆఫ్ స్టోన్-(ఇంగ్లీష్)-నెట్ ఫ్లిక్స్
పద్మిని (మలయాళం) -నెట్ ఫ్లిక్స్
పెయిన్ కిల్లర్(ఇంగ్లీష్)-నెట్ ఫ్లిక్స్
జరహత్కే జర బచ్ కే (హిందీ)-జియో సినిమా
వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే
మేడ్ ఇన్ హెవెన్2-ప్రైమ్
ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (జీ ఒరిజినల్)-జీ5
అబర్ ప్రోలీ (బెంగాలీ) -జీ5
ఇన్ అనదర్ వరల్డ్ విత్ మై స్మార్ట్ ఫోన్2-నెట్ ఫ్లిక్స్
ది జంగబూరు కర్స్- సోనీ లివ్
ట్రయిల్స్ ఆఫ్ ద డ్రీమ్ చేజర్స్-నెట్ ఫ్లిక్స్
పెండింగ్ ట్రైన్(జపనీస్)-నెట్ ఫ్లిక్స్
తాళి(హిందీ)-జియో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
వీటిలో చాలా సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఇప్పటికే స్రీమింగ్ అవుతున్నాయి గమనించగలరు.