పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ బ్రో మూవీ హక్కులను సొంతం చేసుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా చేసిన సినిమా బ్రో. గత నెలలో విడుదలైన బ్రో మూవీ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. పవర్ స్టార్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో పాటు అమాయకత్వంతో కూడిన సాయి ధరమ్ తేజ్ క్యూట్ పెర్ఫార్మన్స్ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రో మూవీకి అదిరిపోయే కలెక్టన్స్ ని తీసుకొచ్చాయి. తొలి మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూలు చేసిందంటే బ్రో మూవీ సాదించిన విజయం తాలూకు రేంజ్ ని అర్డం చేసుకోవచ్చు తాజాగా బ్రో మూవీ గురించి వచ్చిన ఒక న్యూస్ సినీ అభిమానులతో పాటు పవన్ అండ్ సాయి ధరమ్ అభిమానుల్ని ఫుల్ ఖుషి చేస్తుంది.
మనుషుల ప్రాణాలు తీసుకుపోయే కలి అవతారంలో ఉన్న దేవుడిగా పవన్ కళ్యాణ్ బ్రో మూవీ లో అద్భుతంగా నటించాడు. అలాగే ప్రస్తుత సమాజం ఇప్పుడు తమకి ఉన్న టైం ప్రకారం జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఫ్యూచర్ ఫ్యూచర్ అంటు ప్రస్తుత జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని అలాగే నువ్వు ఉన్నా లేకపోయినా నీ కుటుంబం మాత్రం బతకటం ఆగదు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ద్వారా సూపర్ గా చెప్పారు. దేవుడు క్యారక్టర్ లో పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో నటించాడు. అలాగే ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన సాయి ధరమ్ తేజ్ తన కుటుంబం తన వల్లే నడుస్తుంది తన కుటుంబాన్ని సెటిల్ చేసాక నన్ను మళ్ళి చంపేసి తీసుపో అని చనిపోయిన తనని తీసుకెళ్లిన కలి దేవుడితో చెప్పి ఇంకో సారి భూమ్మీదకి వస్తాడు సాయి ధరమ్ తేజ్.
ఆ తర్వాత తాను లేకపోయినా తన కుటుంబం నడవగలదు అని తెలుసుకునే పాత్రలో సాయి ధరమ్ తేజ్ అత్యద్భుతంగా నటించాడు. మిగతా పాత్రల్లో నటించిన వాళ్ళు కూడా సూపర్ గా నటించారు. సముధ్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ బ్రో మూవీ పవన్ అండ్ సాయి ధరమ్ తేజ్ అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో బ్రో మూవీ ఈ నెల 25 న విడుదల కాబోతుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ ప్రమోషన్స్ లో భాగంగా బ్రో మూవీ రిలీజ్ సంబంధించి అప్ డేట్ ని ఉంచింది. మొదట పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న మూవీని తీసుకు రావాలనుకున్నారు.. కానీ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చెయ్యాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకి వారం రోజుల ముందే మూవీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని నెట్ ఫ్లిక్ సంస్థ తెలిపింది. సో.. ఆగస్ట్ 25 నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులకి అండ్ సాయి ధరమ్ తేజ్ అభిమానులకి,సినీ ప్రేక్షకులకు బ్రో మూవీ పండగ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు
Time is usually precious, but this time it’s POWERFUL 😎
BRO starring Pawan Kalyan and Sai Tej is coming to Netflix on 25th of August! pic.twitter.com/gvVqt2CrXR— Netflix India (@NetflixIndia) August 20, 2023