మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం.. ‘గాడ్ ఫాదర్’. మలయాళీ ‘లూసిఫర్’ మూవీకి అఫిషియల్ రీమేక్ గా ఈ సినిమాను తెలుగులో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి చౌదరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 5న బాక్సాఫీస్ బరిలో దిగిన గాడ్ ఫాదర్ మూవీ.. విడుదలైన 50 రోజుల్లోనే ఓటిటిలో రిలీజ్ కాబోతుందని సమాచారం. చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇక చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార లాంటి స్టార్స్ ఉండేసరికి గాడ్ ఫాదర్ మూవీని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత మెగా అభిమానులకు ఈ సినిమా ఊపు ఇచ్చిందని చెప్పవచ్చు. పొలిటికల్ థ్రిల్లర్ జానర్ లో తెలుగు నేటివిటీకి సంబంధించి కీలక మార్పులు చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అదీగాక మెగాస్టార్ నుండి అదిరిపోయే పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియెన్స్ కి కిక్కిచ్చాయి. ఇప్పుడీ మాస్ జాతరను ఓటిటిలో ఎంజాయ్ చేసే సమయం ఆసన్నమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఏ సినిమా అయినా దాదాపు నెల రెండు నెలల్లోపే ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రిలీజైన 50 రోజులలోపే గాడ్ ఫాదర్ ని ఓటిటి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ 19 నుండి గాడ్ ఫాదర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. నెట్ ఫ్లిక్స్ లో గాడ్ ఫాదర్ మూవీ నవంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుందని చూపిస్తోంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ ఓటిటి రిలీజ్ డేట్ తో మెగాఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#GODFATHER pic.twitter.com/GA7SUaqW3X
— Aakashavaani (@TheAakashavaani) November 2, 2022
GodFather OTT Release On Nov 19th#GodfatherOttRelease #GodfatherOnNetflix #GodfatherOttOnNov19th pic.twitter.com/fbWZVwprHT
— DailyUpdates (@DailyUpdates143) November 2, 2022