మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ 1 హీరో గా ఉన్నప్పుడు ఒక తెలుగు నటుడు సినిమా రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. కళ మీద మక్కువతో సినిమా సినిమాకి కష్టపడుతూ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ 1 హీరోగా నిలబడటం జరిగింది. అప్పటి నుంచే మెగా, నందమూరి అభిమానుల మధ్య ఇద్దరి హీరోల సినిమా విషయంలో విపరీతమైన పోటీ ఉండేది. ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నందమూరి వారసుడు బర్త్డే డే విషెస్ చెప్పడం టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అయ్యింది.
చిరంజీవి అనే పేరు వింటే చాలు ఆయన అభిమానులకు పూనకం వచ్చినంత పని అవుతుంది. ఆయన ప్రతి సినిమా రిలీజ్ ని ఫాన్స్ పండుగలా చేసుకుంటారు. అలాగే చిరంజీవి ఒక పిలుపునిస్తే చాలు ఎలాంటి సామాజిక సేవ కార్యక్రమమైనా చేయడానికి ఫాన్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాగే నందమూరి అభిమానులు కూడా స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత బాలకృష్ణని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతగానో అభిమానిస్తారు. నందమూరి హీరోల నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు థియేటర్స్ ని అందంగా అలంకరించి మిఠాయిలు పంచుతూ బాణాసంచా కాలుస్తూ తమ అభిమాన నటుడి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు.
ఇలా ఇద్దరి అభిమానులు తమ హీరోల మీద అభిమానం చూపించుకుంటే పర్లేదు కానీ ఒక్కోసారి తమ హీరో గొప్పవాడంటే తమ హీరో గొప్పవాడని అనుకుంటూ గొడవలకు దిగిన సందర్భాలు కూడా చాలా ఎక్కువ. ఇలాంటి వాళ్లందరికీ కనువిప్పు కలిగించే ఒక సంఘటన నేడు చిరంజీవి బర్త్డే సందర్భంగా జరిగింది. తన ఒంటి చేత్తో సినిమాని సూపర్ డూపర్ హిట్ చెయ్యగలిగే అతికొద్ది మంది తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. తన బాబాయ్ బాలకృష్ణతో పాటు నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎన్టీఆర్ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
ఇంక అసలు విషయంలోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిరంజీవికి బర్త్డే డే విషెస్ చెబుతూ ఒక ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.అలాగే హీరోలు ఎప్పుడు ఒకరికొకరు అభిమానాన్ని చూపించుకుంటూ ఉంటారనే విషయం కూడా వాళ్ళ అభిమానులకి అర్ధం అయ్యింది. హీరోలు ఎప్పుడు ఒకరికి ఒకరు బాగుంటారని వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు ఉండవని అనడానికి ఇదే ఒక ఉదాహరణ అని సినీ ప్రేమికులు అంటున్నారు. అలాగే ఇరువురి హీరోల అభిమానుల కూడా కలిసి మెలిసి ఉండాలని కూడా సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ విదితమే.
Wishing Chiranjeevi Garu @KChiruTweets a very happy birthday. Have a happy and healthy year ahead sir.
— Jr NTR (@tarak9999) August 22, 2023