ఇంటర్నేషనల్ డెస్క్- గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం అయ్యింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ పేరు మారబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇగిదో ఇప్పుడు నిజంగానే ఫేస్ బుక్ సంస్థ పేరును మారుస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్‌బుక్ మాతృ సంస్థను ‘మెటా’ గా పిలవనున్నారు. ఫేస్ బుక్ సంస్ఖ పేరును మార్చినట్టు కంపనీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గురువారం ప్రకటించారు.
రానున్న రోజుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికత మెటావర్స్ కు ప్రాధాన్యత పెరగనుందని ఫేస్ బుక్ అంచనా వేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్ బుక్ సంస్థ పేరును మెటా గా మార్చామని జుకర్ బర్గ్ తెలిపారు. ఐతే సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్ ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఆయన చెప్పారు. కేవలం ఫేస్ బుక్ మాతృసంస్థ పేరును మాత్రమే మార్చామని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.
ఫేస్ బుక్ ను ప్రస్తుతం కేవలం సోషల్ మీడియా సంస్థగానే చూస్తున్నారని, కానీ వాస్తవానికి ప్రజల మధ్య అనుసంధానతను పెంచేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే కంపెనీగా తాము ఉన్నామని జుకర్ బర్గ్ చెబుతున్నారు. ‘మెటా’ అనేది గ్రీకు పదం. ప్రజలు వర్చువల్ విధానంలో కలుసుకొని, పనిచేసి, ఉత్పత్తులను తయారుచేసే సరికొత్త వేదిక మెటావర్స్‌ని తెలిపారు.
వచ్చే పదేళ్లలో వంద కోట్ల మందికి ఈ వేదిక మెటా అందుబాటులోకి వస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని జుకర్ బర్గ్ చెప్పారు. ప్రస్తుతం తమ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రాం, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్‌సెట్, హొరైజన్ వీఆర్ వంటివి భాగంగా ఉన్నాయని, వాటన్నింటికీ ఫేస్‌బుక్ అనే పేరు దర్పణం పట్టడం లేదని జుకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు.
ఫేస్ బుక్ సంస్థ పేరును ‘మెటా’ అని ప్రకటించడానికి తాను గర్వపడుతున్నానని సీఈఓ జుకర్ బర్గ్ అన్నారు. ఐతే తమ యాప్‌లు, వాటి బ్రాండ్‌లు మారడం లేదని ఆయన చెప్పారు. మా లక్ష్యం అలాగే ఉందని, ఇప్పటికీ ప్రజలను ఒకచోట చేర్చడం, మెటావర్స్ ని నిర్మించడానికి యూరోపియన్ యూనియన్ లో పది వేల మందిని నియమించుకునే ప్రణాళికలను ఫేస్‌బుక్ ప్రకటించింది.
రియల్ ఫేస్‌బుక్ ఓవర్‌సైట్ బోర్డ్ అనే స్వచ్ఛంద సంస్థ.. ఆయిల్, పొగాకు వంటి ప్రధాన పరిశ్రమలు తమ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రీబ్రాండ్ చేసినట్లు ఈ సంస్థ కూడా అదే పంథాను ఎంచుకుందని విమర్శించింది. ‘రీబ్రాండ్ సబ్జెక్ట్‌ను మార్చడం వారికి సహాయపడుతుందని ఫేస్‌బుక్ భావిస్తోంది.. అసలు సమస్య పర్యవేక్షణ, నియంత్రణ అవసరం’ అని పేర్కొంది.