దేశంలో కరోనో సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. దీంతో చాలా మంది ఈ మహమ్మారి బారిన పడగా, అనేక మంది మృతి చెందుతున్నారు. దీని పై ప్రముఖ రచయిత్రీ, బుకర్ ప్రైజ్ విన్నర్ ప్రధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వమన్నదే లేదని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమకు అత్యవసరంగా ఓ ప్రభుత్వం కావాలని అరుంధతీరాయ్ అన్నారు. కాబట్టి ప్రధాని మోదీ అత్యవసరంగా తన పదవి నుంచి తప్పుకోవాలని, పూర్తిగా కాకున్నా కనీసం తాత్కాలికంగానైనా దిగిపోవాలని ఆమె కోరారు. స్క్రోల్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌కు రాసిన లేఖలో ఆమె మోదీని తూర్పారబట్టారు. ఈ మేరకు ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌లో ఆమె తన విజ్ఞప్తిని లేఖ రూపంలో రాశారు.
దేశంలో ఇప్పుడు ప్రభుత్వమన్నదే లేదని, కానీ, తమకు అత్యవసరంగా ఒక ప్రభుత్వం కావాలని స్పష్టం చేశారు. ‘‘2024 వరకూ మేం వేచి ఉండలేం. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోతుంటే.. నేను నా ఆత్మగౌరవాన్ని దిగమింగి, కోట్లాది మంది సహచర పౌరులతో గొంతు కలిపి అడుగుతున్నాను. దయచేసి ఇక దిగిపోండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం మీ చేతుల్లో లేదు. ఇంత భయానకమైన ఉత్పాతం నెలకొన్న సమయంలోనూ ఎదుటివారి నుంచి ప్రశ్నను స్వీకరించలేని ప్రధాని ఉన్నప్పుడు వైరస్ మరింతగా పెరుగుతుంది. మీరు ఇప్పుడు దిగకపోతే మాలో లక్షలాదిమంది అనవసరంగా చనిపోతాం. అందువల్ల దిగిపోండి. మీ స్థానాన్ని తీసుకోవడానికి మీ పార్టీలోనే చాలామంది ఉన్నారు. ప్రస్తుత వైర్‌సకు నిరంకుశత్వాలంటే చాలా ఇష్టం. మనం కష్టించి సాధించుకున్న సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుంది. కనుక దిగిపోండి. అని అరుంధతి రాయ్ ఈ పోస్ట్ చేసారు