ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి కొన్నిసార్లు ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అసలు విషయం తెలిశాక ఊపిరి పీల్చుకుంటారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటినుండి సెలబ్రిటీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్‌గా మారుతుంది. సోషల్ మీడియాలో ఒక్కోసారి నటీనటులకు సంబంధించిన వార్తలు చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగాయని, అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి సంఘటననే ఓ నటుడి విషయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
సుదీప్ సారంగి ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బెంగాలీ, హిందీ, తమిళం భాషలలో టెలివిజన్ షోలు చేసేవాడు. 2003లో ‘కాదల్ కొండేన్’ చిత్రంలో సుదీప్ సారంగి హీరోగా చేశాడు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ధనుష్ సైకో కిల్లర్ గా నటించాడు. ఈ ముగ్గురికి ఈ సినిమా మొదటి సినిమానే. కానీ అగర్వాల్, ధనుష్‌కు మంచి ఆఫర్లు రావడంతో వారు నిలదొక్కుకున్నారు.కాకపోతే ఈ మూవీ సుదీప్ కు పెద్దగా పేరు తీసుకురాలేదు. తాజాగా ఆయన డ్రైవర్‌గా మారి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడన్న వార్త సో షల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అసలు విషయానికొస్తే..
హీరో సుదీప్ ఈ ఖాకీ బట్టలతో ఉన్న ఫొటోను చూసి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని అందరు అనుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు నటుడు సుదీప్ క్లారిటీ ఇచ్చాడు. తను ఓ బ్యాంకు ప్రకటన కోసం ఆ వేషం వేయాల్సి వచ్చిందని అసలు విషయం చెప్పుకొచ్చారు. తనకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదని.. తను కొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు తెలిపారు.