ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి కొన్నిసార్లు ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అసలు విషయం తెలిశాక ఊపిరి పీల్చుకుంటారు.
ఫ్లాష్ ఫ్లాష్ : ప్రముఖ వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ కీలక ప్రకటన చేసింది. 20 ఏళ్లపాటు అందించిన న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసినట్టు ప్రకటించింది. మిగిలిన సేవలు యధావిధిగా కొనసాగుతాయి. ఆగస్టు 26 (నేటి)నుంచి యాహూ ఇండియా ఎటువంటి కంటెంట్ పబ్లిష్ చేయదని యాహూ ఎక్కౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహూ తెలిపింది. ఈ పరిణామంతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ ఆగిపోతుంది. ఎఫ్‌డీఐ […]
రాజకీయరంగం నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే నిస్వార్ధ వేదిక .అహోరాత్రాలు ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ దేశ పురోగతికి తోడ్పడుతూ తన పేరు చిర స్థాయిగా చరిత్రలో నిలిచి పోయేలా ఒక గుర్తింపు పొందటం అన్నది లక్ష్యంగా ఉండాలి .ఆ బాటలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి తన సత్తా చాటుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. […]
జిహ్వకో రుచి..పుర్రెకో బుద్ధి అన్నారు..ఎవరి పిచ్చివారికానందం ..అలాగే ఉంది..బంగారు కారు కథ!బంగారం ఎంతో విలువైనది అని అందరికీ తెలుసున్నవిషయమే!ప్రపంచం మొత్తంలో ఆభరణాల తయారీలో దీని వాడకం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.అయితే కొందరు ప్రముఖ వ్యాపార వేత్తలు,సినీ ప్రముఖులు సరికొత్త రీతిలో వారి ప్రత్యేకత చూపించుకోవటం కోసం కొన్నిరికార్డులు కైవసం చేసుకోవటానికి కొత్తదనంతో కొత్త దారులు పట్టటం సహజం!ఒకరు రత్నాలు పొదిగిన దుస్తులు ధరిస్తే ..మరొకరు ఏకంగా బంగారు వస్త్రాలతో వార్తలకెక్కుతుంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు […]
గతం లో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రేక్షకులను మెప్పించి అద్భుతమైన రేటింగ్స్ తో ఎంతో జనాదరణ పొందింది. నాగార్జున ,చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో ఆ షో స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ గేమ్ షో గా మంచి కార్యక్రమాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన విషయం ప్రేక్షకులకు విదితమే . అదే పాపులర్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గా టైటిల్ మార్పుతో మళ్ళీ మరో ఛానల్ స్మాల్ స్క్రీన్‌పై అలరించబోతోంది. దీనికి ఎన్టీఆర్ హోస్ట్ […]
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’కు ఫ్రాన్స్‌కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్డాగ్ సంస్థ భారీ జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యాంటీట్రస్ట్ పెనాల్టీ అని తెలుస్తోంది. వార్తా సంస్థలు, గూగుల్ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల్సి తీసుకొచ్చాయి. […]
పెళ్లి చేసుకునేవారికి శుభవార్త. పెళ్ళి నిశ్చయించిన వెంటనే కల్యాణ శుభలేఖని ఇష్టదైవానికి పంపడం మన సంప్రదాయం. కొంతమంది శ్రీవారి దర్శనం చేసుకుని పాదపద్మాల ముందు శుభలేఖని పెడతారు. తిరుమల రాలేని భక్తుల కోసం టీటీడీ కొత్త ప్రణాళికను రూపొందించింది. చాలామంది తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుమల శ్రీవారికి శుభలేఖను ఎలా పంపాలి? ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. ఎవరైనా ఇక తిరుమల శ్రీవారికి […]
బిగ్ జాక్ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఎత్తైన గుర్రం 2010 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన పేరుమీద నమోదు చేసిన గుర్రం చనిపోయింది. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఈ గుర్రం – బిగ్ జాక్ బెల్జియన్ జాతికి చెందినది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో ఇన్నాళ్లూ ఉంది. నిర్వాహకులు దీని ఆలనాపాలనా చూశారు. ఈక్రమంలో బిగ్ జాక్ గత రెండు వారాల […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. […]
సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2 ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను’ హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ట్రెండింగ్ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో క్రియేట్ చేసిన రెండున్నర గంటల్లోనే లక్ష మందికిపైగా ట్వీట్లు చేయడం విశేషం. దాదాపు అన్ని సోషల్ మీడియాలో జై జగన్ అనే కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకుని చరిత్ర సృష్టించిన […]