దేశంలో కరోనో సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. దీంతో చాలా మంది ఈ మహమ్మారి బారిన పడగా, అనేక మంది మృతి చెందుతున్నారు. దీని పై ప్రముఖ రచయిత్రీ, బుకర్ ప్రైజ్ విన్నర్ ప్రధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వమన్నదే లేదని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమకు అత్యవసరంగా ఓ ప్రభుత్వం కావాలని అరుంధతీరాయ్ అన్నారు. కాబట్టి ప్రధాని మోదీ అత్యవసరంగా తన పదవి నుంచి తప్పుకోవాలని, పూర్తిగా కాకున్నా […]