2019 లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో కర్ణాటకలోని కోలార్ లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమెదు అయ్యింది. 2023, మార్చి 23న పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
2019లో కర్ణాటకలో ఓ ప్రచార సభలో ప్రధాని మోదీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ. ‘దొంగలందరికి.. మీదీ అనే పేరు ఎందుకు ఉంటుంది?’ అంటూ రాహూల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కాగా.. మార్చి 23న సూరత్‌లోని కోర్టు.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కోర్టు తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు కాస్త ఊరటనిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
2019 పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ రాహూల్ గాంధీ సోమవారం సూరత్ సెషన్స్ కోర్టుకు స్వయంగా హాజరైయ్యారు. ఆయన వెంట కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన అశోక్ గహ్లోత్, భూపేశ్ భగేల్ , సీనియర్ నేతలు, రాహూల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ వెంట వచ్చారు. భారీ భద్రత నడుమ రాహూల్ గాంధీ గుజరాత్ లోని సూరత్ సెషన్న్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన జైలు శిక్ష తీర్పు విషయమై సూరత్ సెషన్స్ కోర్టులో అపీల్ వేశారు. ఈ పిటీషన్ లో తన జైలు శిక్ష తీర్పు పై మధ్యంతర స్టే విధించాలని ఆయన కోరారు. రాహూల్ గాంధీ అభ్యర్థనను కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు రాహూల్ గాంధీకి బెయిల్ పొడిగించింది. ఆయన వేసిన పిటీషన్ పై విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఇదే రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై విచారణను మే 3వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది కోర్టు.
2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్ లో ఓ సభలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. సూరత్ న్యాయస్థానంలో రాహూల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై 4 ఏళ్లుగా విచారణ జరిపిన న్యాయస్థానం.. మార్చి 23న పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చి శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద రాహూల్ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించి స్వయంగా హాజరయ్యారు.
Rahul Gandhi Gets Bail, Gujarat Court Pauses 2-Year Sentence https://t.co/5OfshFms1N pic.twitter.com/qpGmNr6fdz
— NDTV (@ndtv) April 3, 2023