ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఎక్కువగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రంగాన్ని ఎంచుకుంటే మంచిది? ఏ ఉద్యోగం చేస్తే జీవితం సాఫీగా సాగుతుంది అన్న డైలమాలో యువకులు ఉన్నారు. సాధారణంగా ఐటీ రంగం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. ప్యాకేజీ ఎక్కువ కాబట్టి అందరూ ఈ సాఫ్ట్ వేర్ రంగం వైపే మొగ్గు చూపుతారు. అయితే సాఫ్ట్ వేర్ రంగం ఎప్పుడు పడిపోతుందో చెప్పలేము. అయితే ఎప్పుడూ నిలకడగా ఉండే రంగాలను ఎంచుకుంటే జీవితం బాగుంటుంది కదా అని ఆలోచించే యువతకు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఒక నివేదికను వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఉపాధి అవకాశాల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ రంగం ముందంజలో ఉన్నట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ వెల్లడించింది. 2020 మార్చి నెలకు సంబంధించి నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ లో బ్యాంకింగ్ రంగం ఆల్ టైం గరిష్ట స్థాయి 4,555కి చేరుకుందని తెలిపింది. గత ఏడాది మార్చి నెలలో ఉన్న 3188 తో పోలిస్తే ఈ ఏడాది 45 శాతం మేర పెరిగిందని పేర్కొంది. ఉపాధి అవకాశాల వృద్ధికి నాన్ మెట్రో పట్టణాలు తోడ్పడినట్లు వివరించింది. బీఎఫ్ఎస్ఐ నియామకాలు మినహాయిస్తే దేశంలో మిగతా నియామకాల ధోరణి అప్రమత్తతో కూడిన ఆశావహంగా ఉన్నట్లు వెల్లడించింది. కొత్త ఉద్యోగ నియామకాల డేటా ఆధారంగా ప్రతి నెలా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదికను నౌకరీ సంస్థ విడుదల చేస్తుంటుంది.
ఈ క్రమంలో మార్చి నెలకు సంబంధించి ఈ సూచీ 2979గా ఉంది. 2022 మార్చి నెలతో పోలిస్తే ఇప్పుడు 5 శాతం మేర పెరిగింది. నూతన ఉద్యోగ కల్పన పరంగా బీమా, బ్యాంకింగ్ రంగాలు సాంప్రదాయ బుల్ ర్యాలీలో ఉన్నట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో గణనీయమైన నియామకాలకు తోడ్పడుతున్నట్లు నివేదించింది. గత ఏడాది మార్చితో పోలిస్తే బీమా రంగంలో ఉపాధి అవకాశాలు 108 శాతం వృద్ధి చెందాయని వెల్లడించింది. ప్రధానంగా బీమా పాలసీలను విక్రయించే విభాగం పేరుతో కొత్త ఉద్యోగులు వచ్చాయని తెలిపింది. అటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు కూడా డిమాండ్ పెరగడంతో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని.. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 45 శాతం ఎక్కువగా పెరిగాయని పేర్కొంది.
ఆయా పట్టణాలను బట్టి బ్యాంకింగ్ ఉపాధి అవకాశాల్లో వైవిధ్యం ఉంది. ఉద్యోగావకాశాల్లో అహ్మదాబాద్ లో 149 శాతం వృద్ధి కనబడగా.. వడోదరలో 72 శాతం, కోల్కతాలో 49 శాతం వృద్ధి కనబడింది. బ్యాంకింగ్ రంగంలో ఆయా పట్టణాల్లో గతంతో పోలిస్తే విపరీతంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. బహుళజాతి బీఎఫ్ఎస్ఐ సంస్థలతో పాటు బ్యాంకింగ్, బీమా ఉత్పత్తులపై దృష్టి సారించిన దేశీయ ఆర్థిక దిగ్గజాల నుంచి ఈ ఉపాధి అవకాశాలు వచ్చినట్లు నివేదికలో వెల్లడించింది. మార్చి నెలలో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు 17 శాతం తగ్గగా.. ఆయిల్ రంగంలో 36 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 31 శాతం, ఎఫ్ఎంసీజీలో 14 శాతం, హాస్పిటాలిటీ రంగంలో 7 శాతం మేర కొత్త ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగ అవకాశాల వృద్ధి పెరిగిందని పేర్కొంది.
మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరగగా.. రిటైల్, విద్య, బీపీఓ రంగాల్లో 4-2 శాతం మేర నియామకాలు తగ్గినట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ వెల్లడించింది. హైదరాబాద్ లో ఐటీ రంగం పరిస్థితి చూస్తే నియామకాలు తగ్గినట్లు తెలిపింది. మెట్రో పట్టణాల పరంగా చూస్తే.. ముంబైలో ఐటీ రంగంలో మార్చి నెలలో 17 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరిగాయని.. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 7 శాతం వృద్ధి కనబడిందని పేర్కొంది. అయితే బెంగళూరులో 12 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 11 శాతం, పుణెలో 2 శాతం చొప్పున నియామకాలు తగ్గినట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. హైదరాబాద్ లో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు గతంతో పోలిస్తే తగ్గినట్లు పేర్కొంది. బ్యాంకింగ్, బీమా, మెషిన్ లెర్నింగ్, ఆయిల్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని పేర్కొంది. మరి నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.