కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల మోదీ ఇంటిపేరు చేసిన వ్యాఖ్యలపై సూరత్ రాహూల్ గాంధీని దోషిగా నిర్ధారించింది.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ర్యాలీలు, భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ఈ సందర్బంగా రాహూల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటిపై కేసులు నమోదు కావడం జరుగుతుంది. తాజాగా రాహుల్ గాంధీ కి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీకి పాట్నా హై కోర్టులో ఉపశమనం లభించింది. మోదీ ఇంటి పేరు పై విదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై పాట్నా హైకోర్టు మే 15 వరకు స్టే విధించడంతో రాహూల్ గాంధీకి కాస్త ఊరట లభించింది. ఈ కేసు విషయంలో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఏప్రిల్ 22న పాట్నా హై కోర్టును ఆశ్రయించారు రాహూల్ గాంధి. దీనిపై విచారణ చేపట్టిన పాట్నా హై కోర్టు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించి.. పరువు నష్టం కేసు సూరత్ కోర్టులో అప్పటికే విచారణ లో ఉండగా.. అదే విషయాన్ని వేరే కోర్టులో మరో విచారణ సరైనది కాదని.. ఇది చట్ట విరుద్దం అని పేర్కొంది. ఈ క్రమంలోనే తదుపరి విచారణ మే 15 కి వాయిదా వేయడంతో పాటు.. అప్పటి వరకు దిగువ కోర్టు విచారణలన్నీ నిలిపివేయాలని కోర్టు ఆదేశిచింది.
2019లో కర్ణాటక.. కోలార్ లో ఓ భారీ బహిరంగ సభలో ‘దేశంలో దొంగల ఇంటి పేర్లు అన్నీ మోదీ అనే ఎందుకు ఉంది’ అంటూ రాహూల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, రాహూల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’తో చేసిన వ్యాఖ్యలపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. మోదీ ఇంటి పేరు పై సూరత్ కోర్టు రాహూల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించింది. ఇక సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహూల్ గాంధీ లోక్ సభ సభ్యతంపై వేటు పడింది. ఈ విషయంపై 30 రోజుల్లోగా హైకోర్టుకు వెళ్లే వీలు కల్పించడంతో పాటు.. రాహూల్ గాంధీ విజ్ఞప్తి మేరకు బెయిల్ కూడా మంజురు చేసింది. ఈ క్రమంలో ఆయన తన బంగ్లా కూడా ఖాళీ చేశారు.