ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత రాహూల్ గాంధీ పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనపై పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావాలు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఓ పరువు నష్టం కేసులో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహూల్ గాందీ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనపై ఎంపీగా అనర్హత వేటు పడింది. పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావా కేసుల్లో ఆయన సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో రాహూల్ గాంధీకి స్వల్ప ఉపశమనం లభించింది. ఓ పరువు నష్టం కేసులో రాహూల్ గాంధీకి భారీ ఉపశమనం లభించింది. వివరాల్లోకి వెళితే..
2019లో కర్ణాటకలో ఓ ప్రచార సభలో ప్రధాని మోదీపై రాహూల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది. నాలుగేళ్ల విచారణ తర్వాత మార్చి 23 న సూరత్ కోర్టు రాహూల్ గాంధీకి పరువు నష్టం కేసులో దోషిగా నిర్దారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇదిలా ఉంటే.. రాహూల్ గాంధీ పై మహరాష్ట్రలో పరువు నష్టం కేసు నమోదు అయ్యింది. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా రాహూల్ గాంధీ ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టుకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన లాయర్ ద్వారా రాహూల్ గాంధీ ఈ మేరకు దరఖాస్తున్న దాఖలు చేసుకున్నారు. ఈ కేసు విచారణ చేసిన థానే జిల్లాలోని జడ్జీ రాహూల్ గాంధీ శాశ్వత మినహాయింపునకు అర్హుడని పేర్కొన్నారు. అయితే జూన్ 3 న కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు.. సాక్ష్యాలు నమోదు చేస్తామని తెలిపారు.
2014లో మహాత్మాగాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణం అంటూ రాహూల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహూల్ మాటలు ఆర్ఎస్ఎస్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. 2014 లో భీవండి మెజిస్ట్రేట్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుటంటే ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా 2018 జూన్ లో రాహూల్ గాంధీ ప్రత్యక్షంగా హాజరు అయ్యారు. అయితే తాను విచారణ సమయంలో ఢిల్లీలో ఉంటానని.. ఎంపీగా వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించాల్సిన పరిస్థితులు ఉంటాయని తనకు కోర్టుకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోర్టుని అభ్యర్థించారు. తనకు బదులుగా తన లాయర్ ని అనుమతించాల్సిందిగా అభ్యర్థనలో కోరారు. ఈ క్రమంలోనే కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.