ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బుర్రవున్న వారెవరైనా ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తారా? అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు కోరుతూ పాల్ చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి మతిలేదా? అని ప్రశ్నించారు. పనికిమాలిన విద్యాశాఖ మంత్రి మాటను. జగన్ వినవద్దు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ తనసొంత కూతుర్లును పరీక్షలు రాయడానికి కోవిడ్ హాల్లోకి పంపిస్తారా… అని నిలదీశారు.
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం దారుణమన్నారు. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని.. ప్రభుత్వం ఎందుకు పంతానికి పోతుందన్నారు.