చాలారోజులకు పాత కోహ్లీ బయటకొచ్చాడు. మైదానంలో ఓ రేంజులో గొడవపడ్డాడు. అవతల ఉన్నది గంభీర్ కావడంతో విషయం కాస్త హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎందుకు గొడవపడ్డారు? అసలేం జరిగింది?
‘ఇఫ్ యువర్ బ్యాడ్.. ఐ యామ్ యువర్ డాడ్’.. ఇది సామెత లేదా సినిమా డైలాగ్ కావొచ్చు. కానీ ఇది విరాట్ కోహ్లీకి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కోహ్లీ వేరు.. ఒకప్పటి కోహ్లీ వేరు. గొడవ అంటే చాలు ముందుండేవాడు. అవతల ఉన్నది ఎవరైనా సంబంధం లేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లనే తన బ్యాటింగ్, గొడవతో చుక్కలు చూపించాడు. పెళ్లయి బాధ్యతలు పెరిగిన తర్వాత కూల్ అయిపోయిన కోహ్లీ.. ఇప్పుడు చాలా గ్రౌండ్ లో గంభీర్ తో చాలా పెద్ద గొడవ చేశాడు. మాటామాటా పెరిగి, కొట్టుకుంటారేమో అనేంతలా గొడవపడ్డారు. ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటి? అసలేం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ గొడవ గురించి చెప్పుకోవాలంటే 2013కి వెళ్లాలి. అప్పుడు కోల్ కతా కెప్టెన్ గా ఉన్న గంభీర్, ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న కోహ్లీ.. ఓ మ్యాచ్ సందర్భంగా మైదానంలో తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజుల ముందు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీని ఓడించిన తర్వాత లక్నో కాస్త శ్రుతిమించి సెలబ్రేషన్స్ చేసుకుంది. గంభీర్.. బెంగళూరు జట్టు ఫ్యాన్స్ ని నోరు మూసుకోమన్నట్లు సైగ చేశాడు. ఆవేష్ ఖాన్ హెల్మెట్.. కింద కొట్టి కాస్త ఎక్కువ చేశారు. పూరన్, రవి బిష్ణోయ్ తదితరులు కూడా అవసరానికి మించి సెలబ్రేట్ చేసుకున్నారు. అవన్నీ గుర్తుపెట్టుకున్న కోహ్లీ.. ఒక్కొక్కరికీ తిరిగి ఇచ్చేశాడు.
తాజాగా లక్నో స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 126/9 స్కోరు మాత్రమే చేసింది. ఛేదనలో లక్నో చతికిలపడిపోయింది. 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. 18 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది. దీంతో కోహ్లీ.. గంభీర్ లా నోటిపై వేలు పెట్టి, స్టేడియంలో ఫ్యాన్స్ కి స్మూత్ వార్నింగ్ ఇచ్చాడు. పూరన్, రవి బిష్ణోయ్ కి సేమ్ వాళ్లలానే సెలబ్రేట్ చేసి కౌంటర్స్ ఇచ్చాడు. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇరుజట్లు ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కామన్.
మ్యాచ్ సందర్భంగా కోహ్లీ-నవీన్ హుల్ హక్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న నవీన్.. కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఏదో అన్నాడు. అప్పుడు వీళ్లద్దరినీ ఇరుజట్లు ఆటగాళ్లు వేరు చేశారు. ఆ తర్వాత కైల్ మేయర్స్ వచ్చి కోహ్లీతో మాట్లాడుతుండగా.. లక్నో మెంటార్ అయిన గంభీర్ వచ్చి మేయర్స్ ని పక్కకి లాక్కెళ్లిపోయాడు. ఇక కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. గంభీర్ తో బాహటంగానే గొడవపడ్డాడు. రక్తాలొచ్చేలా కొట్టుకుంటారేమో అనిపించింది. కానీ జస్ట్ మాటలతో సరిపెట్టేయడంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు. సో అదన్నమాట విషయం.. ఇంతకు ముందు మ్యాచ్ లో జరిగిన దానికి కోహ్లీ.. కౌంటర్ ఇచ్చాడు. అది తీసుకోలేకపోయిన గంభీర్.. కాస్త లైన్ దాటాడు. దీంతో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. మరి ఈ గొడవపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#ViratKohli This is the moment when whole fight started between Virat Kohli and LSG Gautam Gambhir
Amit Mishra
Naveen ul haq#LSGvsRCB pic.twitter.com/hkId1J33vY— Mehulsinh Vaghela (@LoneWarrior1109) May 1, 2023