హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లో స్పోర్ట్స్ బైకుపై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఛాతీ, పొట్ట, ముఖం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న సాయితేజ్ ను మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల వెంటనే ఆసుపత్రికి పరుగులు తీశారు. ప్రస్తుతం సాయి ధరమ్ ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని.. […]
బయో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ డెల్టా సహా అన్ని రకాల కరోనా వేరియంట్లపైన సమర్థంగా పని చేస్తోందని అమెరికాకు చెందిన అత్యున్నత సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) తెలిపింది. రెండు అధ్యయనాలు చేసి సదరు సంస్థ ఈ విషయాన్ని నిర్ధారించింది. కొవాగ్జిన్ తీసుకున్న ప్రజల రక్తనమూనాలను వారిలోని యాంటీబాడీస్ ని అధ్యయనాలు చేసింది. ఆల్ఫా – బీ.1.1.7., డెల్టా – బీ.1.617 వేరియంట్లను ఇది సమర్థంగా […]
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్టార్ హోటళ్లతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. కొన్ని ఆస్పత్రులు కొన్ని హోటల్స్‌తో డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. హోటల్స్‌కి వచ్చే అతిథులకు రహస్యంగా వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం అని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం […]
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో నాలుగు వారాల్లో కట్టడి చేసే మందు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు నిపుణులు. కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. […]
కరోనా మహమ్మారి తన తల్లిని బలి తీసుకుంది. కనిపించని లోకాలకు అమ్మ వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవాలని అనుకుంది ఆ చిన్నారి. అమ్మ ఫోన్ లో ఉన్న ఫొటోలు, వీడియోలను దాచుకోవాలని అనుకుంది. కానీ పాప అనుకున్నది జరగలేదు. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ సమయంలో తన తల్లి వద్ద ఉన్న ఫోన్ తర్వాత మిస్ అయింది. అమ్మకు సంబంధించిన వస్తువులను ఇచ్చారు కానీ ఫోన్ మాత్రం ఇవ్వలేదు కనిపించడం లేదని చెప్పి హాస్పిటల్ సిబ్బంది చేతులు […]
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని […]