ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక పరిస్తితి కూడా తలకిందులైంది. ఆర్థిక మాంద్యం కారణంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించివేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వరుస షాక్ లు ఇస్తున్నాయి.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ థాంప్సన్ స్థానంలో నూతన చైర్మన్‌గా సత్య నాదెళ్ల అతి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవోగా నాదెళ్ల వ్యవహరిస్తున్నారు. 2014లో స్టీవ్ బామర్ నుంచి ఆయన సీఈవో బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక భాగంగా ఉన్న లింక్డ్‌ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్‌తోపాటు జెనీమ్యాక్స్ బిజినెస్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు చైర్మన్‌గా ఎంపిక చేయడం ద్వారా నాదెళ్లకు […]
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అతని వ్యక్తిగత వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ తప్పుకోవడం కొసమెరుపు. బిల్ గేట్స్ ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి మధ్య ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ […]
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని […]