మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అతని వ్యక్తిగత వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ తప్పుకోవడం కొసమెరుపు. బిల్ గేట్స్ ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి మధ్య ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ బోర్డు విచారణకు ఆదేశించింది. విచారణకు సహకరించేందుకు వీలుగా బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్‌కు రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు.
ప్రపం చ కుభేరుల్లో నాల్గో బిలియనీరుగా ఉన్న బిల్ గేట్స్ 2000 నుంచి కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగితో ఎఫైర్ పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ కారణంతోనే 2020 లో కంపెనీ బోర్డు సభ్యుల ఒత్తిడితో ఆయన మైక్రోసాఫ్ట్ తో విడిపోయినట్లు కూడా సమాచారం. ఈ నెలలోనే 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించిన గేట్స్ ఇప్పుడు అనూహ్యంగా రాజీనామా చేయాల్సి రావడం చర్చగా మారింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన తాజా కథనం ప్రకారం బిల్ గేట్స్‌తో చాలా సంవత్సరాలుగా తనకు ఉన్న లైంగిక సంబంధాన్ని తెలియజేస్తూ కంపెనీకి చెందిన ఒక మహిళా ఇంజినీర్ సంస్థలోని ఉన్నతాధికారులకు లేఖ రాశారట. దాంతో కంపెనీ బోర్డు ఓ న్యాయవాద సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించారు.
రాసలీలల ఆరోపణల నేపథ్యంలో బిల్‌గేట్స్ బోర్డులో కొనసాగడం తగదని కొందరు డైరెక్టర్లు భావించారు. దర్యాప్తులో ఏం తేలిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దాతృత్వ కార్యక్రమాల కోసం మరింత సమయం వెచ్చించేందుకు మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు 2020 మార్చిలో బిల్‌గేట్స్ ప్రకటించారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్, మిలిండా గేట్స్ ఈనెల తొలినాళ్లలో ప్రకటించారు. ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, వీరిద్దరూ కలిసి ‘మిలిండా గేట్స్ ఫౌండేషన్’ అనే సంస్థను నడుపుతున్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ ఫౌండేషన్ ప్రపంచంలోని అతిపెద్ద చారిటీ సంస్థల్లో ఒకటి. ఈ ఫౌండేషన్‌లో మాత్రం కలిసి పనిచేయనున్నట్లు వారు స్పష్టం చేశారు.