అందమైన జీవితాన్ని అర్థంతరంగా ముగించేస్తున్నారు కొందరు. బలవంతంగా ప్రాణాలు బలిగొంటున్నారు. సామాన్య ఉద్యోగే కాదూ సాఫ్ట్ వేర్ కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం. చూడటానికి విలాసవంతమైన జీవనం.
అందమైన జీవితాన్ని అర్థంతరంగా ముగించేస్తున్నారు కొందరు. బలవంతంగా ప్రాణాలు బలిగొంటున్నారు. సామాన్య ఉద్యోగే కాదూ సాఫ్ట్ వేర్ కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం. చూడటానికి విలాసవంతమైన జీవనం. వీరికేమీ కష్టాలు ఉంటాయని అనుకుంటుంటారు కానీ.. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు.. టెక్కీలకు కూడా కష్టాలు ఉంటాయి. ఈఎంఐ జీవితంతో పాటు పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు వెరసి.. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నాడు. వీరితో పాటు కుటుంబ సభ్యులను కూడా బలితీసుకుంటున్నాడు. తాజాగా అమెరికాలో భారత టెకీ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.
అమెరికాలోని మేరీల్యాండ్‌లో భారతీయ టెకీ ఫ్యామిలీకి చెందిన భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య, బిడ్డను చంపి.. తాను బలవనర్మణానికి పాల్పడ్డాడో సాఫ్ట్ వేర్. వివరాల్లోకి వెళితే.. మేరీల్యాండ్ స్టేట్‌లోని బాల్టిమోర్ కౌంటీలో కర్నాటకకు చెందిన భార్యభర్తలు యోగేష్ హెచ్ నాగరాజప్ప (37), ప్రతిభా వై. అమర్‌నాథ్ (37 నివసిస్తున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు యష్ హెన్నాల్ ఉన్నాడు. భార్యా భర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. అయితే ఏమైందో ఏమో.. శుక్రవారం నుండి వీరి ఇంటి నుండి తుపాకీ మోత మోగింది. అనుమానం వచ్చిన చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురు మృతదేహాలను గుర్తించారు. ఈ ముగ్గురు తుపాకీ తూటాలకు బలైనట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో.. నాగరాజప్ప.. భార్య, బిడ్డను తుపాకీతో కాల్చి, అనంతరం అదే తుపాకీతో అతడు కాల్చుకుని చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఎందుకు ఇంతటి ఘాతుకానికి నాగరాజప్ప ఒడికట్టాడో తెలియాల్సి ఉంది.